Devadasu Movie
-
అక్కినేని తర్వాతే ఎవరైనా.. ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని ఘనత
ఆ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లని ఈ హీరో అధిగమించాడు. అతడి కంటే ఇతడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ ఒకప్పుడు రికార్డులు అంటే వేరే ఉండేవి. అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించాడు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ట్రాజెడీ కింగ్ ఏఎన్నార్ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగాలే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)ఎప్పటికీ గుర్తుండిపోయే..లైలా-మజ్ను సినిమాలో అక్కినేని భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజైన నాలుగేళ్లకు 'దేవదాసు' చేశారు. ఇది ఏఎన్నార్ కెరీర్లోనే సాహసోపోతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే 'దేవదాసు' నవల చదివినోళ్లు.. అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్లు.. 'దేవదాసు'గా ఏఎన్నార్ ఆకట్టుకోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈ మూవీ తన నటజీవితానికి సవాలుగా భావించారు. 'జగమే మాయ..', 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు.ఆ రెండింటిలోనూపై రెండే కాదు 'అనార్కలి' సినిమాలోని సలీమ్గానూ అక్కినేని యాక్టింగ్ అద్భుతం. దీనితో పాటు పెళ్లి కానుక, సుమంగళి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగమనసులు, రావణుడే రావణుడైతే తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ అదరగొట్టేశారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజెడీ కింగ్‌గా నిలిచిపోయారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నవలా నాయకుడుఇప్పుడంటే రీమేక్ కథలని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. ఈ రెండు విషయాల్లోనూ ఏఎన్నార్‌ని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాడు, రాలేడు!(ఇదీ చదవండి: అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!) -
మళ్లీ దక్షిణాదివైపే చూపు
తమిళసినిమా: నటి ఇలియానా కన్ను మళ్లీ దక్షిణాదిపై పడింది. తొలి చిత్రం దేవదాస్ ఈ అమ్మడికి టాలీవుడ్లో అనూహ్య సక్సెస్‌ను అందించింది. అదే విధంగా పోకిరి చిత్రం స్టార్ ఇమేజ్ను తెచ్చి పెట్టింది. అంతే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే కోలీవుడ్‌లో కేడీ చిత్రం ఇలియానాను నిరాశపరచడంతో ఇక్కడ ఆమెను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత టాలీవుడ్ క్రేజ్ కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా నన్బన్ చిత్రంలో నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది. అలా పాపులర్ అయిన ఇలియానాకు బాలీవుడ్‌పై మోహం పుట్టింది. అంతే దక్షిణాదిని దూరం చేసుకుంది. అయితే బాలీవుడ్లో ఒకటీ అరా చిత్రాలు ఇలియానాకు చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. అక్కడిప్పుడు అవకాశాలు పెద్దగా రావడం లేదు, సక్సెస్‌లు లేవు. దీంతో తరచూ వివాదాలతో వార్తల్లో ఉండేలా తాపత్రయ పడుతోంది. ఆ మధ్య దక్షిణాది చిత్రాల్లో నా నడుమును చూపడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారని, అక్కడ నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని మీడియాకు ఇంటర్వ్యూ లు ఇచ్చి కలకలం రేపింది. అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లోకెక్కింది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసేసుకుందనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి బాలీవుడ్ మీడియా ప్రశ్నించగా స్పష్టమైన సమాధానమివ్వకుండా ఎస్కేప్ అయ్యింది. ఇక హిందీలో నటిస్తున్న తాను మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో నటించాలని ఆశ పడుతున్నానని, అయితే గ్లామరస్ పాత్రలను కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు, అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని ఇలియానా పేర్కొంది. మరి పిల్లి మెడకు ఎవరు గంట కడతారో చూడాలి. -
దేవదాసు పాతాళభైరవి లాంటి ప్రేమకథ
కారులో వాళ్లిద్దరే ఉన్నారు. హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్తున్నారు. వైవీయస్ చౌదరి డ్రైవ్ చేస్తున్నాడు. సడన్‌గా ఓ చోట వేరే రూట్‌కి తిప్పాడు. ‘‘ఇటెందుకు? ఇదంతా గతుకుల రోడ్డు. కొంచెం లాంగ్ కూడా’’ అన్నాడు కొమ్మినేని వెంకటేశ్వరరావు. ‘‘ఏం పర్లేదు. ఈ రూట్లో జర్నీ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ట్రాఫిక్ కూడా తక్కువ’’ చెప్పాడు చౌదరి. మాట్లాడలేదు కొమ్మినేని. అతనికి తెలుసు... చౌదరి ఒకసారి ఫిక్స్ అయితే తన మాట తనే వినడని! హరికృష్ణను హీరోగా పెట్టి ఆమధ్యే ‘సీతయ్య’ తీశాడు. దానికి క్యాప్షన్ ‘ఎవరి మాటా వినడు’! ఆ మాట చౌదరికి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్. ‘సీతయ్య’కు బాగా పేరొచ్చింది. చౌదరి తర్వాత ఏం చేస్తాడు? కొమ్మినేని క్యూరియాసిటీతో అడిగాడు. ‘‘ఈసారేంటి?’’ చౌదరి డ్రైవ్‌ను ఆస్వాదిస్తూ సమా ధానం చెప్పలేదు. దారిలో ఓచోట ‘పాతాళభైరవి’ పోస్టర్ కనిపించింది. దానివైపు చూపిస్తూ ‘‘అలాంటి ప్రేమకథ చేద్దాం. అందరూ కొత్తవాళ్లతో’’ అన్నాడు చౌదరి. ఆ టైమ్‌లో చౌదరితో సినిమా చేయడానికి పెద్ద హీరోలు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఇతగాడేమో కొత్తవాళ్లతో సినిమా అంటాడేంటి? ఈ జర్నీ ఎటు వెళ్తుందో!! అబ్బాయి పక్కా మాస్. అమ్మాయి ఫుల్ క్లాస్. ఇద్దరి మధ్యనా ప్యూర్ లవ్. పెద్దవాళ్లు ఒప్పుకోరు. అది కామన్. ఆ అమ్మాయి ప్రేమ కోసం అమెరికా వెళ్తాడు అబ్బాయి. ఇట్స్ ఎ న్యూ థాట్! రాకుమారిని మాంత్రికుడు ఎత్తుకెళ్లిపోతే తోటరాముడు వెళ్లలేదూ... ఇదీ అంతే. టైటిల్ ‘బాలరాజు’. ఫుల్ స్క్రిప్ట్ రెడీ. హైదరాబాద్‌లో ‘బొమ్మరిల్లు’ ఆఫీసులో కూర్చున్నారు చౌదరి, కొమ్మినేని. అది చౌదరి సొంత బ్యానర్. బాధ్యతంతా కొమ్మినేనిది. చౌదరికి అతనే బ్యాక్‌బోన్! ఈ ‘బాలరాజు’కి హీరోగా ఎవరిని తీసుకుందాం? ఏదైనా కాంటెస్ట్ రన్ చేద్దామా?... ఇలా ఏవేవో డిస్కషన్స్.‘‘అల్లు అర్జున్ ఈ స్టోరీకి కరెక్ట్ అనిపిస్తోంది’’ అన్నాడు కొమ్మినేని. ‘‘గుడ్ ఐడియా. ‘గంగోత్రి’ తర్వాత ఏ సినిమా కమిట్ అయినట్టు లేడు. అల్లు అరవింద్ గారిని కలిసొస్తా’’... చౌదరిలో హుషారు. కట్ చేస్తే - గీతా ఆర్ట్స్ ఆఫీసులో ఉన్నాడు చౌదరి. అరవింద్ కథ విని, ‘‘మావాడికి బావుంటుంది. కానీ ‘ఆర్య’ సినిమా చేస్తున్నాడు. అదయ్యాక డెసిషన్ తీసుకుందాం’’ అని చెప్పారు. బన్నీకి కూడా ఇంట్రస్ట్ ఉంది. కానీ చౌదరికి కన్ఫ్యూజన్. ‘ఆర్య’ పూర్తయ్యాక ఒకవేళ కాదంటే? అందుకే ఎవరైనా కొత్త హీరోతో వెళ్లిపోతే బెటర్. సీనియర్ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ రమ్మంటే వెళ్లాడు చౌదరి. ‘‘తిరుమలై అనే తమిళ సినిమా హక్కులు కొన్నా. నీ డెరైక్షన్‌లో రీమేక్ చేద్దామనుకుంటున్నా. ఏమంటావ్?’’ అడిగారు రవికిశోర్. ‘‘ఆల్రెడీ నేనో ప్రాజెక్టు ప్లానింగ్‌లో ఉన్నా. కొత్త హీరో హీరోయిన్లు కావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి’’ అడిగాడు చౌదరి. రవికిశోర్ తన మొబైల్ ఫోన్లో ఓ వీడియో చూపించారు. ‘‘ఈ కుర్రాడు చాలా బావున్నాడు. డీటైల్స్ చెప్పండి. నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా’’ అన్నాడు చౌదరి. ‘‘మా తమ్ముడు మురళి చిన్నకొడుకు.. రామ్. నేను, సురేశ్‌బాబు కలిసి ‘ఫర్ ది పీపుల్’ అనే మలయాళ సినిమాను ‘యువసేన’గా రీమేక్ చేయాలనుకుంటున్నాం. నలుగురు కుర్రాళ్లలో ఒకరిగా రామ్‌ను ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాం’’ చెప్పారాయన. ‘‘కుర్రాణ్ణి నాకొదిలేయండి. భారీ లెవెల్లో ఈ సినిమా చేస్తా’’ అన్నాడు చౌదరి. రవికిశోర్‌కి కూడా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కానీ ఇంకో ట్విస్ట్ ఉంది. ప్రసిద్ధ దర్శకుడు శంకర్ నిర్మాత అవతారమెత్తి, బాలాజీ శక్తివేల్ డెరైక్షన్‌లో ‘కాదల్’ అనే ఫిల్మ్ ప్లాన్ చేశాడు. హీరోగా రామ్ ఆల్మోస్ట్ ఓకే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చౌదరి సినిమా చేయాలంటే, రామ్ రెండు సినిమాలు మానేయాలి. కానీ రామ్‌కు ఏది బెస్ట్ ఫ్యూచర్నిస్తుందో రవికి శోర్ బాగా జడ్జ్ చేయగలరు. చౌదరికే ఆయన ఓటు. హమ్మయ్య, చౌదరికి హీరో దొరికాడు. ఇక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాలి. చౌదరి ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లో అరవింద్ నుంచి పిలుపు. బన్నీ డేట్స్ ఇవ్వడానికి రెడీ. అప్పటికే ‘ఆర్య’ సూపర్ హిట్. బన్నీతో సినిమాలు చేయడానికి చాలామంది క్యూలో ఉన్నారు. కానీ చౌదరికే ఫస్ట్ చాన్స్. అయితే రామ్‌కి మాటిచ్చేశాడు చౌదరి. అరవింద్‌తో ఆ విషయం చెప్పి వచ్చేశాడు. ముంబైలో ఫేమస్ మోడల్ కో-ఆర్డినేటర్ సుష్మా కౌల్ ఆఫీస్. హీరోయిన్లు కావాలనుకునే అమ్మాయిలందరికీ ఆమె ఆఫీసే పెద్ద అడ్డా. అక్కడ ఇలియానా ఫొటో చూడగానే చౌదరి ఫ్లాట్. లవ్లీగా ఉంది. కానీ ఆల్రెడీ తేజ సెలెక్ట్ చేసేశాడు... ‘ధైర్యం’ మూవీ కోసం. పాపం చౌదరి! మళ్లీ వెతుకులాట మొదలు! ఇలియానా హైదరాబాద్‌లో, ‘ధైర్యం’ షూటింగ్లో ఉంది. నిజానికి ఆ క్యారెక్టర్‌కి ఫాస్ట్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి. ఇలియానా ఏమో సాఫ్ట్ లుక్. అప్పటికే కొంత షూట్ చేశారు. తనను తీసేయలేరు. అలాగని ఉంచనూ లేరు. అదే టైమ్‌లో చౌదరికి ఇలియానా నచ్చిందన్న విషయం జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా తేజకు తెలిసింది. ‘‘వాళ్లకంతగా నచ్చితే ఇచ్చేద్దాం. అయితే ఇలియానా హర్ట్ కాకూడదు’’ చెప్పాడు తేజ. అంతా స్మూత్‌గా జరిగిపోయింది. తేజ క్యాంప్‌లో నుంచి చౌదరి క్యాంప్‌లోకి వచ్చిపడింది ఇలియానా. హీరోయిన్ ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్ లాంటి స్టేచర్ ఉన్నవాడు కావాలి. కానీ ప్రకాశ్‌రాజ్ అన్ని డేట్స్ ఇవ్వలేడు. దాంతో శాయాజీ షిండేను తీసుకున్నారు. మ్యూజిక్ కీరవాణి చేయాలి. లాస్ట్ మినిట్‌లో చక్రి చేరాడు.హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కాబట్టి ప్రమోషన్ హై లెవెల్లో ఉండాలి. టైటిల్ నుంచే డిస్కషన్ స్టార్ట్ కావాలి. ‘బాలరాజు’ కన్నా ‘దేవదాసు’ బాగుంటుంది. ఓపెనింగ్ ఇన్విటేషనే అదిరిపోయింది. 36 పేజీలు. ఆల్బమ్‌లా ఉంది. అందరి లుక్కూ ‘దేవదాసు’పైనే. 2004 సెప్టెంబర్ 24. ‘దేవదాసు’ గ్రాండ్ ఓపెనింగ్. ఇండియాతో పాటు బ్యాంకాక్‌లో 17 రోజులు, యూఎస్‌లో 45 రోజులు తీశారు. యూఎస్‌లోని గ్రాండ్ కాన్యన్, హాలీవుడ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికన్ కాంగ్రెస్ బిల్డింగ్ లాంటి చోట్ల షూట్ చేశారు. పాతిక మంది యూనిట్‌తో ఇన్ని లొకేషన్స్‌లో తీయడం మాటలు కాదు. ఫిల్మ్ అక్కడే కొని, అక్కడే డెవెలప్ చేశారు. టిక్కెటింగ్‌తో కలిపి యూఎస్, బ్యాంకాక్ ఎపిసోడ్ల షూటింగంతా 90 లక్షల్లోపే పూర్తి చేసేశారు. అంత తక్కువలో ఎలా చేయగలిగారని చాలామంది ఆశ్చర్యపోయారు. చౌదరి కూడా అమరశిల్పి జక్కన్నే. సినిమా కంప్లీట్ కావడానికి 192 రోజులు పట్టింది. 6 కోట్లతో ‘దేవదాసు’ రెడీ. సంక్రాంతికి రిలీజ్. పోటీలో వెంకటేశ్ ‘లక్ష్మీ’, లారెన్స్ ‘స్టైల్’, సిద్ధార్థ్ ‘చుక్కల్లో చంద్రుడు’ ఉన్నాయి. అందరూ స్టార్సే. ఇదొక్కటే నాన్‌స్టార్ మూవీ. 2006 జనవరి 11న ‘దేవదాసు’ రిలీజైంది. ఫస్ట్ ఫోర్ వీక్స్ డివెడైడ్ టాక్. ఆరోవారం నుంచీ ‘దేవదాసు’కి అందరూ దాసోహం. హైదరాబాద్‌లోని ఓడియన్‌లో ఏకంగా 200 రోజులు ప్రదర్శితమైంది. రామ్‌కి ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్. ఇలియానాకు కూడా ఒకప్పుడు దివ్యభారతికొచ్చినంత క్రేజ్. ‘పాతాళభైరవి’ చూస్తున్నాడు చౌదరి. పక్కనే కొమ్మినేని. ‘సాహసం సాయరా డింభకా’ అనే డైలాగ్ దగ్గర పాజ్ చేశాడు. ఈ డైలాగ్ నా కోసమే చెప్పారా ఏంటి? అనుకున్నాడు. ‘దేవదాసు’ 200 రోజుల షీల్డ్ అతని వైపే విజయగర్వంతో చూస్తోంది. వెరీ ఇంట్రస్టింగ్ ఒక సామాన్యుడు, ఓ కోటీశ్వరుడి కూతుర్ని ప్రేమించి, ఆ ప్రేమ కోసం ఫారిన్ వెళ్లడమనే కాన్సెప్ట్‌తో తారకరత్న ‘భద్రాద్రిరాముడు’, శివాజీ ‘ఎర్రబాబు’ చేశారు. ఈ రెండూ కూడా ‘దేవదాసు’ కన్నా ముందే రిలీజయ్యాయి. ‘దేవదాసు’ టైమ్‌లోనే నితిన్ హీరోగా ‘ఎడిటర్’ శంకర్ డెరైక్షన్‌లో ఇదే కాన్సెప్ట్‌తో సినిమా మొదలుపెట్టి ఆపేశారు. దర్శకుడు సూర్యకిరణ్ మలయాళంలో అదే పేరుతో డబ్ చేశారు. హిందీలో ‘సబ్సే బడా దిల్వాలా’ పేరుతో అనువాదమైంది. బెంగాలీలో ‘పగ్లూ’ పేరుతో రీమేక్ అయ్యింది.