devaruppula
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, జనగామ : జిల్లాలోని దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వెళుతున్న డీసీఎం వ్యాను, కారు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారి పెనుగొండ గణేష్, సుకన్య ,మహమ్మద్ నజీర్(కారు డ్రైవర్)గా గుర్తించారు. మంజుల, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
టీడీపీ ఎంపీటీసీలకు రిమాండ్
దేవరపల్లి : దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా ఈ నెల 4న ఎన్నికల అధికారి విధులను ఆటంకపరిచిన కేసులో ఇద్దరు టీడీపీ మహిళా ఎంపీటీసీలు, మరో ముగ్గురు పార్టీ నాయకులకు కొవ్వూరు న్యాయస్థానం శనివారం రిమాండ్ విధించినట్టు స్థానిక ఎస్సై ఆర్.శ్రీను శనివారం చెప్పారు. ఆయన కథనం ప్రకారం ఈ నెల 4న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక జరుగుతుండగా టీడీపీ మండల అధ్యక్షుడు సుంకర దుర్గారావు, టీడీపీ నాయకులు కాట్రగడ్డ శ్రీనివాస్ చౌదరి, ఉప్పునూరు రాంబాబు, మహిళా ఎంపీటీసీలు చింతపల్లి నాగమణి, బి.ఇందిర మరికొంత మంది టీడీపీ నాయకులు దాడి చేసి తన విధులకు ఆటంకపరిచినట్టు ఎన్నికల అధికారి ఎంవీ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కొవ్వూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అనంతరం వీరిని కొవ్వూరు సబ్‌జైలుకు తరలించినట్టు తెలిపారు. -
అంగట్లో టీఆర్ఎస్ టికెట్లు: ఎర్రబెల్లి
దేవరుప్పుల, న్యూస్‌లైన్: పరాయి పాలన వద్దన్న కేసీఆర్.. తెలంగాణ రాగానే ఆ పార్టీ టికెట్లను అంగట్లో పెట్టాడని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాక్‌రావు ఆరోపించారు. శుక్రవారం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరికి అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు టీఆర్ఎస్ జహీరాబాద్ టికెట్టు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కకుపెట్టి మొన్నటి వరకు ఉద్యమానికి విఘాతం కల్పించిన కొండాసురేఖ లాంటి వారికి టికెట్లు కేటాయించడం దారుణమన్నారు. మందకృష్ణకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు వర్దన్నపేట నియోజకవర్గంలో ఎన్డీఎ కూటమి పక్షాన అభ్యర్థులను విరమింపజేశామన్నారు. -
త్యాగధనులను విస్మరించిన టీఆర్ఎస్
మందకృష్ణ ధ్వజం దేవరుప్పుల, న్యూస్‌లైన్: తెలంగాణ రాగానే టీఆర్ఎస్ త్యాగధనులను విస్మరి స్తోందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. 70వేల మంది సెటిలర్స్ ఉన్న హూజూర్‌నగర్ నుంచి.. పైగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీద శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బరిలో నిలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ కోసం సామాజిక ఉద్యమం చేసిన వారికి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మొండిచేయి చూపారని విమర్శించారు. కేసీఆర్ పాలన వస్తే బీసీలకు తీరని అన్యాయం జరగుతోందన్నారు. -
మూడు దశాబ్దాలుగా ఉద్యమ బాట
=నాంది పలికిన కడవెండి భూపోరాటం =సంచలనం సృష్టించిన జీవీకే ప్రసాద్ లొంగుబాటు =దండకారణ్యంలోనే చెల్లెలు దేవరుప్పుల, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుముడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి లొంగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయూంశమైంది. ఉసెండి లొంగుబాటుతో ఆయన స్వగ్రామమైన దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం వార్తల్లోకి ఎక్కింది. మూడు దశాబ్దాల క్రితం స్వగ్రామంలో జరిగిన పడమటి తోట భూపోరాటాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఓ భూస్వామికి చెందిన పడమటితోట(ఆరు ఎకరాలు)లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం మొదలైంది. అనంతరం ఆ పోరాటంలోకి సీపీఐ(ఎంఎల్)జనశక్తి ప్రవేశించి ప్రాబల్యం పెంచుకుంది. అరుుతే కొంత మంది విద్యార్థులు, యువకులు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక అప్పట్లో న్యాయవాది విద్యనభ్యసిస్తున్న అదే గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డిని ఆశ్రయించి భూపోరాటంపై చర్చించారు. తన మిత్రుడైన లింగాలఘనపురం మండలం చీటూరుకు చెందిన రవీందర్‌ను పురుషోత్తంరెడ్డి కలిశారు. రవీందర్‌కు అప్పటికే పీపుల్స్‌వార్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు మరికొంత మంది విద్యార్థులు, యువకులు ఆర్‌వైఎల్(రాడికల్ యూత్ లీగ్), ఆర్ఎస్యు(రాడికల్ స్టూడెంట్ యూనియన్)లో చేరారు. ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి అలియూస్ ఏపీ సారథ్యంలో వీరు పోరాటం చేసి గ్రామంలోని పడమటితోటను సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఆ భూపోరాటంతో పాటు నాటి రైతాంగ సాయుధ ఫోరాట స్పూర్తితో ఇక్కడి నుంచి యువకులు నక్సల్ ఉద్యమంలో కీలక నేతలుగా ఎదిగారు. అందులో వెంకటకృష్ణప్రసాద్ అలియూస్ ఉసెండి ఒకరు. దశాబ్దాల కాలం పాటు అజ్ఞాత జీవితం గడిపిన క్రమంలో 1986లో ఎన్కౌంటర్లో పీపుల్స్‌వార్ జిల్లా కమిటీ సభ్యుడుగా పైండ్ల వెంకటరమణ అలియాస్ కొండన్న, 1999 డిసెంబర్లో కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో పీపుల్స్‌వార్ రాష్ర్ట కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, అనంతరం నెక్కొండ ఎన్కౌంటర్లో పెద్ది శ్రీను అశువులు బాశారు. కళారూపాలతో చైతన్యం పాటు, ఒగ్గు కథల ప్రదర్శనలతో ఉసెండి ప్రజలను చైతన్యం చేశారు. పీపుల్స్‌వార్‌లో ఆయన కళాకారుడిగా రాణించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం మూడు దశాబ్దాలుగా ఆయన అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుముడవెళ్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ ఉసెండికి స్వయాన చెల్లెలైన రేణుక అలియాస్ భాను దండకార ణ్య ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఉసెండి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యూరు. తమ్ముడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రసుత్తం ఉసెండి తల్లిదండ్రులు ఆయన సోదరుడి వద్ద ఉంటున్నారు. ఉద్యమంలో వచ్చిన మార్పులతో విభేదించడంతో పాటు అనారోగ్య కారణాలతో చత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోరుునట్టు సమాచారం. ఉసెండిని రాష్ట్ర పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు తెలిసింది.