వైఎస్సార్సీపీకి ఓటు అభివృద్ధికి రూటు...
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీకి ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి బాట వేయడమేనని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగునీటి సమస్య తీరాలన్నా, అర్హులకు పింఛను అందాలన్నా, పిల్లలు చదువుకోవాలనుకున్నా, 9 గంటల విద్యుత్ అందాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఫ్యాన్‌గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మడపాంలో పిల్లా రమణ, కోమర్తిలో ఉంగటి రాజు, యారబాడులో పుట్టా శిరీష, లుకలాంలో శానాపతి అప్పన్నమ్మ, నడగాంలో లుకలాపు కళావతి పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. మడపాంలో పని చేస్తున్న ఉపాధి వేతనదారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. యారబాడు, వీఎన్‌పురం, నర్శింగరాయుడుపేట తదితర గ్రామాల్లో ఓటర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆరంగి మురళీధర్, పొన్నాన దాలినాయుడు, బెహరా అప్పన్న, పతివాడగిరీశ్వరరావు, పుట్టా ఆదిలక్ష్మి, మడ్డు కృష్ట, జాయి శేషు,యాబాజి రమేష్, సురవరపు జగదీశ్వరరావు, ఎస్వీ రమణ,మానికల సూర్యనారాయణ, దుల్ల రమణ,రువ్వవాసు, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రాడ మద్దతు కోరిన శాంతి
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాడ మోహనరావును నడగాంలోని ఆయన స్వగృహంలో వైఎస్సార్సీపీ పార్లమెం టరీ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్ కలి శారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. పాలవలస రాజశేఖరంతో తన కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయనను పార్టీలోకి రావాలని నేతలు ఆహ్వానించారు.
బాగున్నారా అంటూ పలకరింపులు
జలుమూరు: బాగున్నారా అంటూ అం దరినీ పలకరిస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు వైఎస్సార్సీపీ పార్లమెం టరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి. మంగళవారం జలుమూరు మం డలంలోని అందవరం, పర్లాం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అందరినీ నమస్కరిస్తూ పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులుగాఎం.విజయశాంతి, కొయ్యాన సుశీల, వెలమల ప్రభావతిని గెలిపించాలని కోరారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వి.కృష్ణారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కె. సూర్యారావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఎం.రాంబాబు,సర్పంచ్‌లు పి.తవిటినాయడు, కె.కృష్ణవేణి, ఎ.పద్మావతి, కె.మిధున్‌చక్రవర్తి, పి.విఠలరావు, ధర్మాన జగన్, కె.ప్రకాశరావు, ఆర్.నరుసునాయు డు, ఎన్.గోవిందరావు, ఎన్.రామారా వు, కె.ఉత్తరుడు, కె.నాగరాజు, అల్లు రామారావు తదితరులు పాల్గొన్నారు.