రూ.1,500 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి: కడియం
గండేడ్: మూడు నెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను రూ.1,500 కోట్లతో అభివృద్ధి పర్చనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గండేడ్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గేల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.32 కోట్ల వ్యయంతో అందించిన డ్యూయల్ డెస్క్ టేబుళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
వచ్చే మూడు నెలల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, నీరు, విద్యుత్ సరఫరా, కిచెన్షెడ్లు, ప్రహరీల నిర్మాణా లు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌తో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను మూతవేయబోమని స్పష్టం చేశారు. త్వరలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పట్లో డీఎస్సీ లేదు: ఇప్పట్లో డీఎస్సీ ప్రకటించే అవకాశంలేదని కడియం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గండేడ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందిం చారు.
ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం
కుల్కచర్ల: సమస్యలను పరిష్కరించాలని నిరసనకు దిగిన ఉపాధి హామీ సిబ్బందిపై కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల్కచర్ల మండలం రాంపూర్‌లోని ఆశ్రమ పాఠశాల భవనం ప్రారంభోత్సవం అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా ఉపాధిహామీ సిబ్బంది నిరసనకు దిగారు.