The development of the villages
-
‘మన ఊరు.. మన ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ధి
కోయిల్‌కొండ: వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేపట్టేందుకే ‘మన ఊరు -మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాకలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు శుక్రవారం. స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించిన మన మండల-మన ప్రణాళిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి హాజరయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశుధ్యం, హరితవనం, అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతులు పండించే పంటలకు కావలసిన విత్తనాలను వారే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అవసరమైతే పాలెం పరిశోధన కేంద్రం నుంచి నిపుణులను పంపి సూచనలు, సలహాలు ఇప్పిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయూలన్నారు. అగష్టు15లోగా లక్ష్యాన్ని పూర్తి చేసిన సర్పంచులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 4.50లక్షల మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపగా ఇందులో2.25 లక్షలు మంజూరయ్యూయని, అందులో 40వేలు మాత్రమే పూర్తి కావడం జరిగిందన్నారు. నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసేందుకు సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యూర్డుల నిర్మాణానికి నిధులు మంజూైరె నట్లు తెలిపారు. మహిళాసంఘాలు పాడిపరిశ్రమపై ఆసక్తి చూపాలన్నారు. కోయిల్‌సాగర్ నుంచి మండలానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గొండ్యాల వాగు ద్వారా మండలంలోని ఏడు పెద్ద చెరువులకు నీరు అందించేందుకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సివిల్ ఆసుపత్రికి అత్యాధునిక భవనం స్థానిక సివిల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అత్యాధునిక భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ్ర కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణంపై స్థానికుల సూచనలు ,సలహాలు స్వీకరించారు. ఆసుపత్రి చుట్టూ మరికొంత స్థలాన్ని సేకరించి రెండస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడ ఉన్న పాత పోలీస్‌స్టేషన్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. రూ.43లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. నీటి సరఫరాకు పెద్ద వాగులో సంపు ఏర్పాటు చే యూలని గ్రామసర్పంచ్ మంజూల, మాజీ ఎం పీపీ వై.మహేందర్‌గౌడ్ కలెక్టర్‌ను కోరారు. కా ర్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ జయచంద్ర, ఎం పీపీ బోయిని స్వప్నరవి, వైఎస్ ఎంపీపీ శారద, ఎంపీడిఓ భాగ్యలక్ష్మీ, తహశీల్దార్ ప్రేమ్‌రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ పుల్లారెడ్డి, ఏఈ సమీర్‌ఉల్లాఖాన్, క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికిప్రణాళిక లే కీలకం
తిర్యాణి : గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలే కీలకమని కలెక్టర్ డాక్టర్ జగన్మోహన్ అన్నారు. తిర్యాణి మండలం కన్నెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు- మన ప్రణాళిక చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 73 ప్రకారం గ్రామసభలకు చ ట్టబద్ధత కల్పిస్తోందని, దీని ప్రకారం గ్రామసభలో తీర్మానం చేసే పనులను తప్పకుండా చేపడతామని చెప్పారు. చిన్నారులంతా బడికి వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేస్తుందని చెప్పారు. అనంతరం డీఈవో, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డి మన ఊరు, మన ప్రణాళికలో భాగంగా గ్రామస్తులకు అవసరమైన పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. గ్రామస్తులు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, తిర్యాణి నుంచి 3 ఇంక్లైన్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, రోడ్డు మరమ్మతు చేపట్టి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి మార్చాలని ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి కలెక్టర్‌ను కోరారు. ఉట్నూర్ ఆర్డీవో రాంచంద్ర య్య, గ్రామ సర్పంచ్ దుస్స మధుకర్, తిర్యాణి సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ సర్పంచులు వెడ్మ సోము, చంచు దుర్గయ్య, వైద్యాధికారి కిరణ్, ట్రాన్స్‌కో ఏఈ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాయెంగి మల్లేశ్, నాయకులు జగదీశ్, ముత్యం రాజయ్య, వార్డు సభ్యులు, గ్రామైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు. బోగస్ రేషన్‌కార్డులపై దృష్టి రెబ్బెన : జిల్లాలో కుటుంబాలకు మించి ఉన్న బోగస్ రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం రెబ్బెన తహశీల్దా ర్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని భూసమస్యలు, రేషన్‌కార్డుల వివరాల ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించేందుకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జరి గే అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. వేలిముద్రలు సరిగా వేయలేనివారు, రెండు చేతులు కోల్పోయిన వికలాంగులకు సెల్ఫ్ డిక్లరేషన్‌పై మ్యాన్వల్ పద్ధతిలో పింఛన్ అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో మొదట్లో విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల కోసం సోయా, పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు విత్తినవాటి లో సుమారు 70 శాతం విత్తనాలు మొలకెత్తినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాంచంద్రయ్య ఉన్నారు. -
నిధులిచ్చారు..అనుమతి మరిచారు..
ఇందూరు, న్యూస్‌లైన్ : ప్రతి ఆర్థిక సంవత్సరానికి గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులను జిల్లాకు కేటాయిస్తూ వస్తుంది. కానీ వాటిని ఖర్చు చేద్దామంటే అనుమతి ఇవ్వడం లేదు. దీంతో సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియడంతో వచ్చిన నిధులన్నీ మంజురు కాకుండానే నిలిచిపోతున్నాయి. నిలిచినపోయిన నిధులను తిరిగి మళ్లీ మంజురుకు అనుమతివ్వకుండానే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 13వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించి విడుదల చేస్తోంది. దీంతో కేంద్రం అందించే అభివృద్ధి నిధులు దేనికి అక్కరకు రాకుండా పోతున్నాయి. ఫలితంగా గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోకుండా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులనే పంచాయతీ రాజ్ కమిషనర్ వరప్రసాద్ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఇటు జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించారు. కానీ 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతివ్వకపోవడం కారణంగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీల నిధులు రూ.12 కోట్ల నిధులకు మోక్షం కలిగించకుండానే కొత్త ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు రూ.1,38,84,200 నిధులను కేటాయించింది. అలాగే జిల్లా, మండల పరిషత్‌లకు కలిపి దాదాపు రూ.6 కోట్ల వరకు కేటాయించినట్లు తెలిసింది. సంబంధిత సెక్షన్ అధికారులు సెలవులో ఉండటంతో జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు నిధులు ఎన్ని వచ్చాయో అధికారికారికంగా చెప్పలేకపోతున్నారు. రూ. 26 కోట్లకు చేరిన నిధులు.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.12 కోట్ల 61 లక్షల 71వేల 900 నిధులు ఆర్థిక శాఖ అనుమతి నిరాకరించడంతో నిధులు నిలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.13 కోట్ల 88 లక్షల 45 వేల 200లను కేటాయించింది. పాత నిధులు, కొత్త నిధులు మొత్తం కలిపితే గ్రామ పంచాయతీలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.26 కోట్ల 50 లక్షల 17 వేల 100కు చేరింది. ఈ లెక్కలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. కొత్త నిధులకు కూడా రాని అనుమతి.. గత పక్షం రోజుల క్రితం జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అలవాటు ప్రకారంగానే వాటి విడుధలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు గత నెల 23న జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు అన్నీ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించారు. కానీ పది రోజులు కావాస్తున్న ఆర్థిక శాఖ వాటి విడుదలకు ట్రెజరీ అధికారులకు అనుమతి( ఆథారైజేషన్) ఇవ్వడంలేదు. దీంతో ఆ బిల్లులను ట్రెజరీ అధికారులు పక్కన పెట్టారు. అయితే వారం పది రోజుల్లో నిధుల విడుధలకు అర్థిక శాఖ నుంచి అనుమతి రావొచ్చని ట్రెజరీ, పంచాయతీ శాఖల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధులు రూ.12 కోట్ల 61 లక్షల నిధులకు మాత్రం ఇప్పట్లో మోక్షం కలిగే విధంగా సూచనలు కనిపించడంలేదు. అయితే నిబంధనల ప్రకారం నిధులు మంజురు చేసిన 15 రోజులల్లో ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నిధులను విడుదల చేయాలి. ఇలా చేయకపోతే ప్రభుత్వంతో పాటు ఆర్థిక శాఖకు జరిమాన విధించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.