తిర్యాణి : గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలే కీలకమని కలెక్టర్ డాక్టర్ జగన్మోహన్ అన్నారు. తిర్యాణి మండలం కన్నెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు- మన ప్రణాళిక చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 73 ప్రకారం గ్రామసభలకు చ ట్టబద్ధత కల్పిస్తోందని, దీని ప్రకారం గ్రామసభలో తీర్మానం చేసే పనులను తప్పకుండా చేపడతామని చెప్పారు. చిన్నారులంతా బడికి వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేస్తుందని చెప్పారు.
అనంతరం డీఈవో, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డి మన ఊరు, మన ప్రణాళికలో భాగంగా గ్రామస్తులకు అవసరమైన పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. గ్రామస్తులు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, తిర్యాణి నుంచి 3 ఇంక్లైన్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, రోడ్డు మరమ్మతు చేపట్టి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి మార్చాలని ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి కలెక్టర్‌ను కోరారు.
ఉట్నూర్ ఆర్డీవో రాంచంద్ర య్య, గ్రామ సర్పంచ్ దుస్స మధుకర్, తిర్యాణి సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ సర్పంచులు వెడ్మ సోము, చంచు దుర్గయ్య, వైద్యాధికారి కిరణ్, ట్రాన్స్‌కో ఏఈ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గాయెంగి మల్లేశ్, నాయకులు జగదీశ్, ముత్యం రాజయ్య, వార్డు సభ్యులు, గ్రామైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు.
బోగస్ రేషన్‌కార్డులపై దృష్టి
రెబ్బెన : జిల్లాలో కుటుంబాలకు మించి ఉన్న బోగస్ రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం రెబ్బెన తహశీల్దా ర్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని భూసమస్యలు, రేషన్‌కార్డుల వివరాల ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించేందుకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జరి గే అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. వేలిముద్రలు సరిగా వేయలేనివారు, రెండు చేతులు కోల్పోయిన వికలాంగులకు సెల్ఫ్ డిక్లరేషన్‌పై మ్యాన్‌వల్ పద్ధతిలో పింఛన్ అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో మొదట్లో విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల కోసం సోయా, పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు విత్తినవాటి లో సుమారు 70 శాతం విత్తనాలు మొలకెత్తినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాంచంద్రయ్య ఉన్నారు.
అభివృద్ధికిప్రణాళిక లే కీలకం
Published Wed, Jul 16 2014 4:37 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
Advertisement