2018 నాటికి పోలవరం నుంచి నీరు
విజయవాడ: 2018 నాటికి గ్రావిటీ సాయంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఉదయం నిర్వహించిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టును నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నారన్నారు.