devotee problems
-
శ్రీ వారి సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు
-
తిరుమల: సర్వదర్శన టికెట్ల కోసం భక్తుల నిరసన
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అర్థరాత్రి నుండే వేలాది మంది భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం గుమికూడారు. సర్వదర్శనం ప్రారంభించిన గంటలోనే 5 వేల టికెట్ల కోటా పూర్తి అయింది. ఇంకా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శన టికెట్లు కోసం భక్తులు నిరసనకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని.. సమస్యను పరిష్కరించారు. సోమవారం వరకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 'భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం వేచి ఉన్న సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కొందరు వేసుకోవడం లేదు. ఇలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి టీటీడీ చైర్మన్‌తో చర్చించి.. సర్వదర్శనం టికెట్లపై నిర్ణయం తీసుకుంటాం' అని అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. -
ఏమి ‘టీ’ బాధ
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు అశేషంగా తరలివస్తున్న లక్షలాది భక్తులకు వసతుల లేమి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఉపవాసాలు ఉండి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు మండుటెండలోనే కూర్చొని టీ తాగడం, అల్పాహారాలు భుజించడం వల్ల అసహనానికి గురవుతున్నారు. -
పుష్కర ఘాట్‌లో భక్తులకు వేధింపులు
అంతర్వేది (మలికిపురం) : అంతర్వేది ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు పోలీసుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఘాట్‌కు వెళ్లేమార్గంలో భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకుని స్నానాలకు వెళ్తున్నారు. ఆ వాహనాల ప్లగ్‌లను కొందరు పోలీసులు తస్కరిస్తున్నట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ తరువాత అయినా ఫ్లగ్‌లు ఇవ్వకుండా భక్తులను పోలీసులు వేధిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన దంపతులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా బైక్‌ల ప్లగ్‌లను దొంగలు పట్టుకుపోతున్నారని పోలీసులే సెలవిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.