పుష్కర ఘాట్‌లో భక్తులకు వేధింపులు | devotee faced problems with police in anntharvedhi | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌లో భక్తులకు వేధింపులు

Jul 17 2015 10:47 AM | Updated on Aug 1 2018 5:04 PM

అంతర్వేది ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు పోలీసుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్వేది (మలికిపురం) : అంతర్వేది ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు పోలీసుల నుంచి వేధింపులు  ఎదురవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఘాట్‌కు వెళ్లేమార్గంలో భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకుని స్నానాలకు వెళ్తున్నారు. ఆ వాహనాల ప్లగ్‌లను  కొందరు పోలీసులు తస్కరిస్తున్నట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పోనీ తరువాత అయినా ఫ్లగ్‌లు ఇవ్వకుండా  భక్తులను పోలీసులు వేధిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన దంపతులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా బైక్‌ల ప్లగ్‌లను దొంగలు పట్టుకుపోతున్నారని పోలీసులే సెలవిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement