రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ : శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు యాభై వేల మంది తరలివచ్చారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. ఉదయం భారీ వర్షం కురియడంతో భక్తులంతా వర్షంలో తడుస్తూనే రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.28 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్ పర్యవేక్షించారు.