dhanamma
-
షాకింగ్ వీడియో: ఘోర ప్రమాదం
-
షాకింగ్ వీడియో: ఘోర ప్రమాదం
శుభకార్యంలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన ఓ తల్లీకుమారుడిని మృత్యువు కబళించింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యానికి కనుమూసి తెరిచేలోపే రెండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం (మునుగోడు) : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపుర్ గ్రామానికి చెందిన గొర్రెంకల ధనమ్మ(50), అతడి కుమారుడు యాదగిరి(24) శుక్రవారం బైక్‌పై నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. శనివారం స్వగ్రామం చిత్తాపుర్కు బైక్‌పై బయలుదేరారు. మృతదేహాలు చెల్లాచెదురుగా.. హైదారాబాద్‌లోని చంపాపేట్‌కు చెందిన ఓ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న తోర్పనూరి దానయ్య, భార్య పద్మతో కలిసి కారులో చండూరు మండలంలోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో కొత్తగూడెం స్టేజి వద్ద ఎదురుగా వస్తున్న యా దగిరి, ధనమ్మల బైక్‌ను రాంగ్రూట్లో వచ్చి వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ సుమారు పది మీటర్ల ఎత్తుకు ఎగిరింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లీకుమారుడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా, దానయ్య కారు కూడా అదుపుతప్పి సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టడంతో వారిద్దరికి గాయాలయ్యాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాద విషయం తెలుసుకున్న కొత్తగూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన తల్లీకుమారుడు విగతజీవులుగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ యాదవరెడ్డి ఘట న స్థలాన్ని పరిశీలించి తొలుత ప్రమాదంలో గాయపడిన దానయ, అతడి భార్య పద్మను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం మేరకు చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు కొత్తగూడెం చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండడంతో వాటి పుటేజీలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఆరు నెలల కిందటే వివాహం.. ప్రమాదంలో మృతిచెందిన ధనమ్మకు భర్త చంద్ర య్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు యాదగిరికి ఆరుమాసాల క్రితమే వివాహం జరిగింది. ఇతను ఫిలింసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు చౌటుప్పల్ ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. శుభకార్యానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
విరిగిన ధనమ్మ మర్రి చెట్టు
- ఈదురు గాలులకు వెయ్యి ఎకరాల అరటితోట నేలమట్టం - అంధకారంలో లంక గ్రామాలు కపిలేశ్వరపురం (మండపేట): గోదావరి చెంత ఆహ్లాదకరంగా ఉన్న లంక గ్రామాలు సోమవారం కకావికలమయ్యాయి. ఉన్నట్టుండి విరుచుకుపడ్డ ఈదురు గాలులకు ఉద్యాన పంటలు నేలనంటాయి, జిల్లాలోపర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందిన ధనమ్మ మర్రి ఆవరణలోని మర్రి చెట్టు నేలకొరిగింది. కేదారిలంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల అరటి తోట కుప్పకూలిపోయింది. కురిసిన వర్షానికి నేలలోని కంద కుళ్ళిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లంక గ్రామాల ప్రజలు చీకటిమాటున బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. వీఆర్వో స్వామినాయుడు, సర్పంచి రంకిరెడ్డి సత్యవతి, పంచాయతీ అధికారులు పరిస్థితిని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. -
ముగ్గురు జల సమాధి
దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యు ఒడికిదాసరహళ్లి వద్ద ఘటన కోలారు : చెరువులో మునిగి ముగ్గురు వ్యక్తులు జల సమాధి అయిన ఘటన గురువారం సాయంత్రం బంగారుపేట తాలూకా నేరెళే కెరె గ్రామం వద్ద చోటు చేసుకుంది. కేజీఎఫ్ సమీపంలోని దాసరహళ్లి గ్రామానికి చెందిన సురేష్ (38), ధనమ్మ (23)దంపతులు కొంత కాలంగా దాసరహొసహళ్లిలో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం దుస్తులు ఉతకడానికి పక్కింటి బాలిక ఉమాభారతితో కలిసి చెరువుకువెళ్లారు. అక్కడ సురేష్ ఈత కొట్టడానికి ప్రయత్నించి పూడికలో కూరుకుపోతుండగా రక్షించేందుకు వెళ్లిన భార్య ధనమ్మ, పక్కింటి బాలిక ఉమాభారతి గల్లంతయ్యారు. చెరువు గట్టున దుస్తులు, చెప్పులు చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది, బంగారుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించి సాయంత్రం 7గంటల సమయంలో సురేష్, ధనమ్మ, ఉమాభారతి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పండుగ ముందు రోజున దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఈరెండు కుటుంబాలలో విషాదం అలుముకుంది. -
మహిళ ఆత్మహత్యాయత్నం
తుంగతుర్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ధనమ్మ(30) అనే మహిళ బుధవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ దొంగతనం కేసు విషయంలో రోజూ తనను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. హుటాహుటిన ఆమెను తుంగతుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.