ముగ్గురు జల సమాధి | tomb of the three water | Sakshi
Sakshi News home page

ముగ్గురు జల సమాధి

Published Sat, Apr 9 2016 2:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

tomb of the three water

దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యు ఒడికిదాసరహళ్లి వద్ద ఘటన

 

కోలారు : చెరువులో మునిగి ముగ్గురు వ్యక్తులు జల సమాధి అయిన ఘటన గురువారం సాయంత్రం బంగారుపేట తాలూకా నేరెళే కెరె గ్రామం వద్ద చోటు చేసుకుంది. కేజీఎఫ్ సమీపంలోని దాసరహళ్లి గ్రామానికి చెందిన సురేష్ (38), ధనమ్మ (23)దంపతులు  కొంత కాలంగా దాసరహొసహళ్లిలో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం దుస్తులు ఉతకడానికి పక్కింటి బాలిక ఉమాభారతితో కలిసి చెరువుకువెళ్లారు. అక్కడ సురేష్ ఈత కొట్టడానికి ప్రయత్నించి పూడికలో కూరుకుపోతుండగా రక్షించేందుకు వెళ్లిన భార్య ధనమ్మ, పక్కింటి బాలిక ఉమాభారతి గల్లంతయ్యారు.


చెరువు గట్టున  దుస్తులు, చెప్పులు చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది, బంగారుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించి సాయంత్రం 7గంటల సమయంలో  సురేష్, ధనమ్మ, ఉమాభారతి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పండుగ ముందు రోజున దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఈరెండు కుటుంబాలలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement