'పోరాటం ఫలించే సమయం వచ్చింది'
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణ లక్ష్యానికి చేరువయ్యామని, ఈ సమయంలో మాదిగ ఉప కులాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. వచ్చేనెల 20న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ధర్మ యుద్ధం మహా సభ సన్నాహక సదస్సును సోమవారం నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. పోరాటం ఫలించే సమయం వచ్చిందన్నారు. అప్రమత్తంగా ఉండి వర్గీకరణను సాధించుకుందామన్నారు. వచ్చేనెల 20 న నిర్వహించే ధర్మయుద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.