dharmana prasadrao
-
రాష్ట్రంలో రాక్షస పాలన
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. అన్ని వర్గాలను మోసగించిన సీఎం చంద్రబాబును ప్రజలు క్షమించరని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరం పీఎన్కాలనీ రెండో లైన్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వాడ మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా ఉన్న నాయుకుడు ధర్మాన ప్రసాదరావు అని కొనియాడారు. ఇటువంటి నాయకుడు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఉండడం సిక్కోలువాసులు చేసుకున్న అదృష్టమన్నారు. చంద్రబాబునాయుడు తొలుత రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని చెప్పి.. తర్వాత ప్రత్యేక ప్యాకేజీతోనే అనేక లాభాలుంటాయని యూటర్న్ తీసుకున్నారని గుర్తు చేశారు. తర్వాత మళ్లీ మాటమార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు విసుగుచెందిన ప్రజలు వైఎస్సార్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లతోనే ఓడిపోయామని, ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు పార్టీ నాయకులంతా కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరహనరసింహం (వరం), ఎం.వి.పద్మావతి, మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, పి.జె నాయుడు, రేఖా తదితరులు పాల్గొన్నారు. ధర్మానకు అస్వస్థత ఆత్మీయ సదస్సుకి హాజరైన ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మాన జ్వరంతో ఉన్నప్పటికి మీ ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరయ్యారని చెప్పిన మరుక్షణంలోనే కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. -
నాడు వైఎస్ఆర్ మాటలను లెక్కచేయనందుకే..
హైదరాబాద్: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. అందులో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు ఏపీ సీఎం చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఆయన మాటలను లెక్కచేయనందుకే పదేళ్ల పాటు టీడీపీ అధికారానికి దూరమైందని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రధాన ప్రతిపక్షం చెబుతున్న పనులకు సవరణలు చేస్తే నేడు రాష్ట్రంలో ఈపరిస్థితి ఉండేది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో మేలు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చారు. అదే తరహాలో నేడు మహానేత తనయుడు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. శాసన సభలో ఆనాడు వైఎస్ఆర్ మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా పదేళ్లు అధికారానికి దూరమైంది. రాష్ట్రంలో పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పట్టించుకోలేదు. ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. నాడు వైఎస్సార్ పాదయాత్రను ప్రజల భరోసాగా మలిచారు. ఇచ్చిన మాట ప్రకారమే రైతుల ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి.. మారానని నమ్మబలికి చంద్రబాబు గెలిచారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. ఐదేళ్ల ప్రభుత్వానికి ఏడాదిలోపే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి" అని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.