dialysis center
-
కిడ్నీ రోగులకు ఉపశమనం
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాసు్క్యలర్ సెంటర్లు, 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న డయాలసిస్ కేంద్రాల్లో అదనంగా 74 డయాలసిస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు డయాలసిస్ తప్పనిసరి. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్ అవసరమవుతుంది. తొలిసారిగా డయాలసిస్ చేయాల్సినప్పుడు రోగికి ముందుగా శస్త్రచికిత్స చేయాలి.డయాలసిస్‌కు యాక్సెస్ పాయింట్‌ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా రోగి చేతి మణికట్టు దగ్గర ఈ పాయింట్ గుర్తించి సర్జరీ చేస్తారు. రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వాసు్క్యలర్ సర్జన్ ఈ ఆపరేషన్ చేస్తారు. ఈ యాక్సెస్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తేనే డయాలసిస్ ప్రక్రియ సులభతరమవుతుంది. ప్రస్తుతం వాసు్క్యలర్ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు కచి్చతంగా హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. దీనివల్ల పేషెంట్లకు ఆర్థికంగా భారం కావడంతో పాటు, నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో వాసు్క్యలర్ యాక్సెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిమ్స్, గాం«దీ, ఉస్మానియాలతో పాటు ఖమ్మం జనరల్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం, మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వాసు్క్యలర్ సెంటర్ల కోసం రూ.32.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. డయాలసిస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా వ్యవస్థ లేకపోవడంతో ఈ కేంద్రాలు అర్ధరాత్రి వరకూ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అదనంగా 74 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న సెంటర్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా రోగులకు ఉపశమనం కలగనుంది. -
వైద్య రంగం బలోపేతానికి రూ. 4,944 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా సామాన్యులకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలోకి తేవాలని యోచిస్తోంది. దీనికోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసింది. ప్రభుత్వంలో డయాగ్నొస్టిక్ సెంటర్లు మొదలు... మానవ వనరుల అభివృద్ధి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల వరకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై దృష్టిసారించింది. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లు, కొత్త ఉస్మానియా, టిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు, ఆరోగ్య కార్డులు, పీఎంయూలు, కేన్సర్ కేర్‌లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.డయాగ్నొస్టిక్ సేవలకే అత్యధికంటి–డయాగ్నొస్టిక్ సేవల బలోపేతానికి వైద్య ఆరోగ్యశాఖ అత్యధికంగా రూ. 1,044 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులోభాగంగా మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హబ్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.600 కోట్లు కేటాయించనుంది. అలాగే ప్రతీ బోధనాసుపత్రిలో ఒక ఎంఆర్ఐ ఏర్పాటుకు మొత్తం రూ.444 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యంగా ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్లపై దృష్టిసారించింది. అందుకోసం రూ. 921 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కొత్తగా 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 35 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు సహా నిమ్స్ పరిధిలో ఇవి ఏర్పాటు కానున్నాయి.పరికరాలకు రూ.750 కోట్లుటిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టిమ్స్‌లు, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తారు. సనత్‌నగర్ టిమ్స్‌లో రూ.50 కోట్లతో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే గచ్చిబౌలి టిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 35 జీజీహెచ్ ఆసుపత్రుల్లో ఒక్కోచోట రూ.350 కోట్లతో 30 పడకలతో డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లను నెలకొల్పుతారు.మరికొన్ని నిర్ణయాలు...⇒ కొత్తగా 108 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 54 కోట్లు⇒ ఆరోగ్య మహిళ కార్యక్రమం సహా ఎంసీహెచ్ సేవలను బలోపేతం చేస్తారు. ప్రస్తుతం 376 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాలు జరుగుతుండగా, వాటిని వెయ్యికి పెంచుతారు. అందుకోసం రూ.300 కోట్లు ఖర్చుచేస్తారు. రూ. 10 కోట్ల వ్యయంతో 10 నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న 44 యూనిట్లను ఆధునీకరిస్తారు. ⇒ నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రూ. 11 కోట్లతో కొత్తగా ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటు. ⇒ 35 జీజీహెచ్‌ల్లో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు. ఒక్కో సెంటర్‌కు రూ. 1.37 కోట్ల చొప్పున రూ. 49 కోట్లు.⇒ 35 బోధనాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేర్ ట్రైనింగ్ కోసం సిములేషన్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సెంటర్‌కు రూ.7 కోట్ల చొప్పున రూ. 245 కోట్లు కేటాయిస్తారు. ⇒ ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కోసం రూ.510 కోట్లు కేటాయిస్తారు. అందులో 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.180 కోట్లు, 10 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.70 కోట్లు, 10 వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.160 కోట్లు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఆధునీకరణ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తారు. ⇒ హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులు సహా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌లలో ఆర్గాన్ రిట్రీవల్ అండ్ స్టోరేజ్ సెంటర్ల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తారు. ⇒ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లను రూ.79 కోట్లతో నెలకొల్పుతారు. ⇒ కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు రూ. 250 కోట్లు ఖర్చు చేస్తారు. ⇒ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ కార్డులు, ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ల కోసం రూ.180 కోట్లు వ్యయం చేస్తారు. ⇒ రూ. 165 కోట్లతో డీ సెంట్రలైజ్డ్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. -
తెలంగాణ వైద్య విద్య దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: తెలంగాణలోని వైద్యవిద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో వైద్యవిద్యను అభ్యసించాలంటే విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రస్తుతం వైద్యం, వైద్య విద్య గ్రామీణ ప్రాంతాలకే వచ్చిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 107 కళాశా లలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రమే కిడ్నీ డయాలసిస్ సెంటర్లు ఉండేవని, వీటిని 102కు పెంచామన్నారు. ప్రతి ఏడాది డయాలసిస్ సెంటర్లకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కిడ్నీ బాధితులపై ఒక్క పైసాకూడా భారం పడకుండా సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామంటే బీబీనగర్‌లోని రూ.500 కోట్ల విలువ చేసే భూమి, భవనాలను కేంద్రానికి అప్పగించా మని, నాలుగేళ్లలో అక్కడ తట్టెడు మట్టికూడా పోయలేదని ధ్వజమెత్తారు. -
ఉద్దానం తాగునీటికి రూ.700 కోట్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 22వతేదీన ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆయన పర్యటించారు. తాగునీటి సమస్యతో కిడ్నీ వ్యాధి ప్రబలుతుందనే ఆందోళన నేపథ్యంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తొలుత ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఆర్నెల్లలో మంచినీరు అందిస్తామని చెప్పారు. హరిపురంలో ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పలాస, సోంపేట డయాలసిస్ సెంటర్లలో అదనంగా ఐదు పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్దానం ఆరోగ్యదాయని కావాలని, కిడ్నీ భూతాన్ని తరిమికొట్టాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కాగా, మంత్రి నాని బొడ్డపాడులో కిడ్నీ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. తమకు పింఛన్లు, పథకాలు ముఖ్యం కాదని, కిడ్నీ వ్యాధి నుంచి రక్షించాలని బాధితులు మొర పెట్టుకున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణమే నెఫ్రాలజిస్టు, ఇద్దరు రేడియోలజిస్టులను నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పలాసలో సేవలపై అసంతృప్తి కిడ్నీ మహమ్మారి వ్యాధిగ్రస్తుల ప్రాణాలు హరిస్తుంటే నామమాత్రపు సేవలతో సరిపెడుతున్నారని మంత్రి నాని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస సీహెచ్‌సీలో కిడ్నీ బాధితులను పరామర్శించారు. డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్ సంస్థ పనితీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెఫ్రాలజిస్టు వారానికి ఒక్కసారి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నివాస్‌కు సూచించారు. పలాస డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ సుభాష్ సమాధానం చెప్పలేకపోవడంతో ఆరోగ్యశాఖ కమిషనర్ రామకృష్ణను పిలిచి ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
వచ్చారు..వెళ్లారు!
► పలాసలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని ► ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై ఆగ్రహం ► ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెళ్లిపోయిన వైనం కాశీబుగ్గ(పలాస): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు జిల్లా పర్యటన వచ్చారు..వెళ్లారు అన్నట్టుగానే సాగింది. కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం ప్రకటిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. శనివారం ఉదయం పలాస చేరుకున్న ఆయన ప్రభుత్వాస్పత్రికి వెళ్లే దారిలో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. వైద్యం అందిస్తున్న తీరుని పరిశీలించి యూనిట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ప్రభు త్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి కామినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ రోగులకు మెరుగై న వైద్య సేవలు అందిస్తామన్నారు. అత్యవస ర పరిస్థితిలో ఉన్న 90 మంది కిడ్నీ రోగులకు కిడ్నీ మార్పిడి జరపాల్సి ఉన్నప్పటికీ.. అంతమందికి కిడ్నీలు తీసుకురాలేమన్నారు. ఈ పరిస్థితిలో డయాలసిస్ కేంద్రాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒక్కసారి డయాలసిస్ చేసుకుంటే రూ.900 ఖర్చవుతోందని, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. శివాజీ చలోక్తి.. ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై చలోక్తులు విసిరారు. పలాసకు ఈఎస్ఐ ఆస్పత్రి ఇస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని అచ్చెన్న దృష్టికి విలేకరులు తెచ్చారు. దీనికి ఆయన స్పందించి మాట్లాడుతుండగానే శివాజీ కలుగజేసుకొని మంత్రి పదవి పొడిగించారు కదా ఇంకేమీ ఈఎస్ఐ ఆస్పత్రి తీసుకొస్తారన్నారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ మూడు వేల మంది కార్మికులు సంతకాలు చేసి ఇవ్వమంటే ఇంతవరకు జీడి పరిశ్రమల యజమానులు, కాష్యూ లేబరు యూనియన్ సభ్యులు, కార్మికులు గాని స్పందించలేదని.. లేదంటే ఇప్పటికే ఈఎస్ఐ ఆస్పత్రి వచ్చేదన్నారు. పలాసకు స్టేడియం మంజూరు చేశామని, దాన్ని సమస్యలు లేకుండా నిర్మించుకునే బాధ్యత స్థానిక నాయకులదేనన్నారు. కార్యక్రమంలో శ్రీకాకు ళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్ మా ధవ్, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మున్సి పల్ చైర్పర్సన్ కోత పూర్ణచంద్రరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్‌రావు, మల్లా శ్రీనివాసరావు, లొడగల కామేశ్వరరావు, శ్రీనివాసరెడి పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధికి కారణాలను అన్వేషిస్తున్నాం ఉద్దాన ప్రాంతంలో మూత్ర పిండాల వ్యాధులు ప్రబలడానికి కారణాలను అన్వేషిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. పలాస ప్రభుత్వ ఆస ్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన సందర ్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో లక్ష మందికి వైద ్యపరీక్షలు చేపట ్టగా 13 వేల మందికి కిడ్నీ వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగిందన్నారు. వీరిలో 90 మందికి మూత్ర పిండాల మార్పిడి అవసరం ఉన్నట్టు చెప్పారు. జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, పలాసలో డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ నెల 17న సోంపేటలో మరో సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నంలో ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కిడ్నీ వ్యాధికి గల కారణాలను వెల్లడిస్తారన్నారు.