‘కాల్‌మనీ’ వ్యవహారంపై పెదవి విప్పని డీఐజీ
కాకినాడ క్రైం (తూర్పుగోదావరి) : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ దాటవేత వైఖరి ప్రదర్శించారు. ‘ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది.. నెక్ట్స్..’ అంటూ విలేకరులు అడిన ప్రశ్నకు మాట దాటవేశారు.
జిల్లా పోలీసు కార్యాలయానికి వార్షిక తనిఖీ కోసం మంగళవారం కాకినాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలన్నింటినీ తోసిపుచ్చారు.