ఇక ఆ బుకింగ్‌లకు డిజిటల్ ఐడీ
న్యూఢిల్లీ: విమాన టికెట్ బుకింగ్‌కు ప్రత్యేకమైన డిజిటల్ ఐడిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయంలోకి ప్రవేశించేటప్పుడు ఎయిర్ ట్రావెలర్లు ఆధార్, పాన్ లాంటి ఇతర గుర్తింపుకార్డుల కాపీలను తీసుకెళ్లడం తప్పనిసరి. అయితే ఇక మీదట విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం డిజిటల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ను పద్ధతిని ప్రవేశ పెట్టేందుకు విమానయాన మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. మరో మూడు నెలల్లో దీన్ని మాండేటరీ చేయనుంది. దీనికోసం ఒక టెక్నికల్ టీంను కూడా ఏర్పాటు చేసింది.
ఎయిర్ టికెట్ బుకింగ్ సమయంలో "డిజిటల్ ప్రత్యేక గుర్తింపు" అవసరాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), పాప్‌పోర్ట్ నంబర్ లాంటి ఇతర అనలాగ్ యూనిక్ ఐడీ ఉన్నప్పటికీ ఈ తరహాలోనే ఒక డిజిటల్ ప్రత్యేక గుర్తింపు కోసం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి తగిన సలహాలను అందించడంకోసం డిజిటల్ ట్రావెలర్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 30 రోజులలో తన రిపోర్ట్ సమర్పించమని కోరినట్టు చెప్పారు. అనంతరం ఇతర పరిశ్రమ వాటాదారుల సలహాలను కూడా ఆహ్వానించనున్నట్టు సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందనీ, ప్రయాణీకుల భద్రత, సౌకర్యం గోప్యతల ఆధారంగా విస్తృతమైన సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ పథకంలో ఆధార్ తప్పనిసరి కాదు. కానీ ఇతర డిజిటల్ గుర్తింపు ఒక ఆప్షన్‌గా ఉంటుందని మంత్రి చెప్పారు.
అయితే ప్రయాణీకులు కోరుకుంటే ఇప్పటికీ బోర్డింగ్ పాస్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు.
Air travellers already require analog unique ID. A digital unique ID such as Aadhar, PAN, passport number, etc. is now proposed 2/2
— Jayant Sinha (@jayantsinha) June 8, 2017
Chaired a discussion on #DigiYatra with industry stakeholders and asked them to submit recommendations in 30 days. pic.twitter.com/snq3omLX83
— Jayant Sinha (@jayantsinha) June 8, 2017