diligence
-
తిరుమల ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
మంచి మాట: విడదియ్యరాని శ్రమ
శ్రమ నుంచి శ్రామికుల్ని, శ్రామికుల నుంచి శ్రమను ఎలా అయితే విడదియ్యలేమో అలా ప్రపంచం నుంచి శ్రమను, శ్రామికులను విడదియ్యలేం. శ్రమలేందే శ్రామికులు లేరు; శ్రామికులు లేందే శ్రమలేదు; శ్రమ, శ్రామికులు లేందే ప్రపంచం లేదు. మనిషికి ప్రపంచం ఆధారం; ప్రపంచానికి శ్రామికుడు ఆధారం. ప్రతి మనిషికి శ్రామికుడి అవసరం ఉంది; ప్రతిమనిషీ శ్రామికుడు అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఈ ప్రపంచం మనకు ఇవాళ ఇలా ఉందీ అంటే అది శ్రామికులు శ్రమిస్తూనే ఉన్నందువల్ల వచ్చిన ఫలితమే. శ్రమతో శ్రామికులు సృజించిన ఆకృతి ప్రపంచం. శ్రమతో, శ్రమలో శ్రామికుడు జీవనం చేస్తున్నందువల్లే ప్రపంచానికి స్థితి, ద్యుతి ఉన్నాయి. అవి మనకు ఆలవాలమూ అయినాయి. మన మనుగడ సాగేందుకు అవి మనతో, మనకై ఉన్నాయి. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అని కవి శ్రీశ్రీ అన్నారు. శ్రమైకజీవనం సౌందర్యమై ప్రపంచం మొత్తానికి సౌందర్యాన్ని తీసుకు వచ్చింది! శ్రమ అన్నదాన్ని లుప్తం చేసి ఊహించుకుంటే ప్రపంచం వికృతంగా ఉంటుంది. శ్రమైక జీవనం అన్నది సౌందర్యం మాత్రమేనా? కాదు. శ్రమైకజీవనం ఈ ప్రపంచానికి లభించిన సౌభాగ్యం కూడా. అనాది గా ప్రపంచం పొందిన ప్రగతికి కారణం శ్రామికుడు. శ్రామికుడు ప్రపంచానికి సౌందర్యప్రదాత. శ్రామికుడు ప్రపంచానికి సౌభాగ్యప్రదాత. అటువంటి శ్రామికుడికి, అతడి శ్రమకు న్యాయం జరుగుతోందా? అనాదిగానే అది లేదు అన్నది క్షేత్ర వాస్తవంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.‘మన ప్రపంచంలో చాలా విషయాలు అన్యాయం; / పత్తిని నాటని వాళ్లు శ్రేష్ఠమైన పత్తి బట్టలు కట్టుకుంటారు. / అంతే కాదు పొలంలో పని చెయ్యని వాళ్లు తెల్లటి బియ్యం తింటారు’ అని అంటూ చైనాలోని ఒక అజ్ఞాత యూనాన్ జానపద కవి వందలయేళ్ల క్రితమే ఆవేదనను వ్యక్తపరిచాడు. చిందిన చెమట కు అందిన ఫలం చాలని స్థితి ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. శ్రమకు, శ్రామికుడికి తగిన ఫలం దక్కాలి. ‘మేఘాలు తియ్యటి నీరును ఇచ్చినట్టుగా, తేనెటీగలు తేనెను ఇచ్చినట్టుగా నువ్వు పశువుల్లో పాలను సృష్టించావు. అదే విధంగా పగలంతా శ్రమించిన శ్రామికుడికి ధాన్యాదిరూపంలో సంపదను ఇవ్వు’ అంటూ వేదంలో ఒక దైవ ప్రార్థన ఉంది. శ్రామికుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష కూడా ఎప్పటినుంచో వస్తూనే ఉంది. ఇకనైనా శ్రమకు, శ్రామికులకు న్యాయం సాకారం కావాలి. ఏడాదిలో ఏ ఒక్కరోజునో శ్రామికుల రోజు అనీ, ఆ రోజున ఏదో హడావిడి చేసేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ తరువాత శ్రామికుల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇక చాలు. ప్రతిరోజూ శ్రామికులకు, శ్రమకు న్యాయం చేస్తూ మనం మన మనుగడను సౌందర్యవంతమూ, సౌభాగ్యవంతమూ చేసుకుందాం. శ్రామికులకు, శ్రమకు గౌరవాన్ని, మన్నను ఇస్తూ మనల్ని మనం గౌరవించుకుందాం; మనకు మనం మన్ననను కలిగించుకుందాం. ఏ ఒక్కరోజో శ్రామికుల రోజు అవదు. ప్రతిరోజూ శ్రామికుల రోజే. సూర్యోదయంతో మొదలయ్యే ప్రతి దినమూ శ్రామికుల దినమే! శ్రమ అన్నది చిందే దినమే! శ్రమ చిందనిదే, శ్రామికులు పని చెయ్యనిదే ఏ దినమూ గడవదు కదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటూ ఒక్కో పేరుతో ఒక్కో దినం ఉంది. ఏ పేరుతో ఉన్న దినమైనా శ్రమ, శ్రామికుల అభినివేశంతోనే అది దినంగా నడుస్తుంది, గడుస్తుంది. ప్రతిదినమూ శ్రామికుల దినమే! – రోచిష్మాన్ -
శ్రమ సౌందర్యం.. ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి
ఏ ఇంటిలోనయినా గృహస్థాశ్రమం ప్రారంభం కాగానే భార్య అందం చూసి భర్త సంతోషపడతాడు. భర్త అందం.. అంతకంటే ఎక్కువగా అతని శీలవైభవం, కీర్తిప్రతిష్ఠలు, రుజుత్వం, సమర్ధత చూసుకొని ఆమె మురిసిపోతుంది. కొంతకాలం గడిచేటప్పటికి ఆ సౌందర్యం తాలూకు అనుభూతిలో మార్పు కనపడుతుంది. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయింది. భర్తకు, పిల్లలకు, అత్తమామలకు, అతిథి అభ్యాగతులకు సేవచేయడంలో ఆమె... కుటుంబపోషణ, అభ్యున్నతికోసం భర్త చెమటోడుస్తుంటారు. చెమటతోపాటు మసి, మట్టి అంటుతున్నా వాటిని వారు గమనించే స్థితిలో ఉండరు. పైగా ఆ సందర్భాల్లో వారిలో ఒకరికి మరొకరు ఇంపుగా కనిపిస్తుంటారు. అది శ్రమ సౌందర్యం. సంగీత సాహిత్యాలు రెండింటిలో అందెవేసిన బహుభాషావేత్త రాళ్ళపల్లి అనంత కష్ణశర్మ గారు హాలుని ‘గాథా సప్తశతి’ ని తెలుగులోకి అనువదించారు. అందులో మానవ జీవిత విలువలకు సంబంధించి ఒక అద్భుతమైన పద్యాన్నిస్తూ...‘‘వంటయింటి పనులనంటిన మసి చేయి సోకియుండ చంద్ర సుందరముగ ఇంపుగొలుపుచున్న ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి’’ అన్నారు. వంటింట్లో ఇల్లాలు పనిచేసుకుంటూ ఉంది. ఆమె చేతికి మసి అంటుకుని ఉంది. అది ఆమె చూసుకోకుండా చెమటను తుడుచుకుంటున్నప్పుడు ఆమె ముఖానికి మసి అంటింది. అక్కడే కొద్ది దూరంలో తన పని చేసుకుంటూ మధ్యలో ఒకసారి భార్యవంక చూసాడు. మచ్చతో ఉన్న చంద్రబింబం మరింత సౌందర్యవంతంగా కనబడినట్లు... ఆయనకు ఆమె ముఖం చాలా ఇంపుగా కనిపించిందట. పార్వతీదేవిని మనం సాధారణంగా రెండు నామాలతో సంబోధిస్తూ ఉంటాం. ఒకటి శివకామసుందరి. రెండవది అఖిలాండేశ్వరి. శివకామసుందరి అన్నప్పుడు ఆమె పరమశివుని ఇల్లాలు. ఆమె అందాన్ని చూచి శంకరుడు అభినందిస్తాడు, సంతోషిస్తాడు. కానీ మనకందరికీ ఆమె జగజ్జనని, అఖిలాండేశ్వరి. ఆమె మాతృత్వం సౌందర్యం. ఆ తల్లిలో ఉన్న మాతృత్వాన్ని చూసుకొని అమ్మా! అని పిలిచి ఎంత కష్టంలో ఉన్నా సేద దీరుతాం. మనకందరికీ అమ్మ. శంకరుడికి మాత్రం ఇల్లాలు. ఒక పార్వతీ దేవి శివకామ సుందరిగా, అఖిలాండేశ్వరిగా పూర్ణత్వాన్ని పొందినట్లు ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా భర్తకి భార్య, పిల్లలకు తల్లి. ఒకనాడు భర్త అందాన్ని చూసి భార్య, భార్య అందాన్ని చూసి భర్త సంతోషించినా కొంతకాలం గడిచిన తరువాత శారీరక అందం తెరమరుగయి, శీల వైభవం మరింత ఇంపుగా కనపడుతుంటుంది. ఇల్లయినా అంతే... ఇల్లు ఎప్పుడూ ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి శుభ్రంగా ఉంటే సంతోషం. పిల్లలు పుట్టి పెద్దయ్యే క్రమంలో వారి అల్లరి దానికితోడు పని భారం, ప్రాధాన్యతల్లో మార్పు వచ్చి... వస్తువులన్నీ చిందరవందరగా పడి కనిపిస్తుంటాయి... ఆ సందర్భంలో ఆ ఇల్లు పిల్లల సందడితో, జీవకళతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రమించినప్పడు వచ్చే చెమట కంపుగా కంటే ఇంపుగా కనిపిస్తుంటుంది.. చెమట విలువ అది. మనం తినే అన్నం ఎంతో మంది రైతులు చెమటోడ్చిన ఫలితం. మనం నిత్యం వాడుతున్న వస్తువులు ఎంతోమంది కార్మికులు చెమటోడ్చి తయారు చేసినవే. మనం పొందుతున్న ప్రశాంతత దేశరక్షణకోసం వేలాది సైనికులు చిందిస్తున్న చెమట ఫలం. చెమట పురోభివృద్ధికి, ప్రగతికి నిదర్శనం. చెమటోడ్చే సమాజంలో, కుటుంబంలో దరిద్రం ఉండదు. శ్రమ సౌందర్యం అందరినీ సంతోషపెడుతుంది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘వాళ్లు’ నిద్రపోతూ పని చేస్తారు!
జపాన్ వాళ్లకు పని రాక్షసులని పేరు. వాళ్లు పని కోసం నిద్రను కూడా త్యాగం చేస్తారంటారు. మరి నిజంగానే నిద్ర పోకపోతే ఆరోగ్యం ఏం కావాలి? జపాన్ వాళ్లు నిద్రే పోరనేది అబద్ధం. అయితే రాత్రవుతూనే మంచం మీద చేరి, సూర్యోదయమవుతూనే మెలకువలోకి రావడం అనే భావనను మాత్రమే వాళ్లు నిద్రగా భావించరు. బస్సులో నిలబడి ప్రయాణిస్తూ, రైలు కోసం ఎదురుచూస్తూ, లిఫ్టులో పదమూడో అంతస్తుకు ఎక్కుతూ కూడా వాళ్లు ఒక కునుకు తీస్తారు. పోతూ పోతూ ఏదైనా గోడ కనబడితే దానికి చేతిని ఆనించి కూడా ఒక కునుకు తీసి వెళ్తారు. దీన్నే జపాన్లో ‘ఇనెమురి’ అంటారు. నిద్రపోతూనే హాజరుగా ఉండటం అని దీనికి అర్థం చెప్పొచ్చు. క్లాసులో పాఠం వింటూ, మీటింగులో భాగస్వామి అవుతూ కూడా వాళ్లు ఇనెమురి చేస్తారు. మన దగ్గర కూడా అట్లా చాలామంది పడుకుంటారుగదా అనొచ్చు. అట్లా పడుకునేవాళ్లకు ఆపాదించే గౌరవం ఎంత? కానీ అదే జపనీయులు దాన్ని తక్కువగా చూడరు. సామాజికంగా దానికి ఆమోదం ఉంది. యుద్ధం తర్వాత, ఎక్కువ పని చేయడం గొప్ప గుణం అనే భావనలోంచి ఈ విధానం పుట్టింది. అందుకే, ఎవరైనా అలా నిద్ర పోతున్నారంటే, ‘పాపం, రాత్రంతా బాగా పనిచేసివుంటాడు’ అని సంశయలబ్ధిని వాళ్లు ఇస్తారు. ‘ఈ ఇనెమురి మనం అనుకునే నిద్రలాంటిది కాదు; అలాగని మధ్యాహ్నపు కునుకు కాదు; అది జపాన్కే ప్రత్యేకమైన నిద్రా విధానం. నిద్ర కాని నిద్ర’ అంటారు జపనీయుల నిద్ర అలవాట్ల మీద అధ్యయనం చేసిన డాక్టర్ బ్రిగిట్ స్టెగార్. ‘ఆయా సాంఘిక సందర్భంలో నిష్క్రియత్వంతో పాల్గొంటూనే, తమ వంతు వచ్చినప్పుడు ఠక్కున భాగస్వామి కావడం ఇందులో ఉన్న కిటుకు,’ అంటారు స్టెగార్. ఇంకొక అంశం ఏమిటంటే, చాలామంది సరిగ్గా నిద్ర పోవాలంటే తమకు ఏకాంతం కావాలంటారు. కానీ జపనీయులు ఇతరుల కంపెనీలో కూడా నిద్రను ఆనందిస్తారు. భూకంపం, సునామీ లాంటివి జపాన్లో సంభవించినప్పుడు కూడా ఇట్లా బహిరంగ సమూహాలుగా నిద్రపోగలగడం వారిని ఉపశమించేలా చేయగలిగింది.