Dinakaran Faction
-
కొత్త ఎత్తుగడ.. షాకుల మీద షాకులు
సాక్షి, చెన్నై : రెండాకుల గుర్తును దూరం చేసుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు మరో భారీ షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలో శశికళ-దినకరన్ వర్గం నుంచి ఐదుగురు ఎంపీలు జంప్ అయిపోయారు. దుండిగల్ ఎంపీ ఎం ఉదయ్ కుమార్, వెల్లూర్ ఎంపీ సెంగుట్టువన్.. మంగళవారం ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిస్వామిని కలిసి మద్దతు ప్రకటించారు. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతూ పళని-పన్నీర్ వెంటే తాము ఉన్నామని ప్రకటించారు. ఇక ముగ్గురు రాజ్యసభ సభ్యులు నవనీతక్రిష్ణన్, విజిల సత్యానంద్, ఎన్. గోకుల క్రిష్ణన్ (పుదుచ్చేరి) నిన్న పళనిసామి, పన్నీర్ సెల్వంతో నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ నుంచి తాము రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయ్యామని.. అధికారిక పార్టీగా గుర్తింపు పొందిన పళని వర్గానికే తాము ఓటేస్తామని వారు ప్రకటించారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా చేజారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, ఉదయ్ కుమార్ గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నమ్మ(శశికళ) వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గుర్తింపు దక్కిన నేపథ్యంలో అధికార పక్షం.. దినకరన్ వర్గాన్ని ఖాళీ చేయించే పనిలో పండింది. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో దినకరన్‌కు ఈ జంపింగ్‌లు పెద్ద తలనొప్పిగా మారాయి. -
దినకరన్ వర్గానికి మూడోసారి నోటీసులు
-
దినకరన్ వర్గానికి మూడోసారి నోటీసులు
సాక్షి, చెన్నై: అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనంటూ వాదిస్తున్న టీవీవీ దినకరన్ వర్గానికి పళని స్వామి ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ మూడోసారి దినకరన్ వర్గానికి నోటీసులు జారీ చేశారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటిస్తూ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడటంతో ఆగష్టు 24న ఒకసారి, సెప్టెంబర్ 1 మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక గురువారం మరోసారి తన మద్ధతుదారు ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని దినకరన్ గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో స్పీకర్ మరోమారు నోటీసులు పంపించారు. సెప్టెంబర్ 14న ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ 19 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు, అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశారు ? అన్న ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తన వర్గ ఎమ్మెల్యేలు చేజారకుండా దినకరన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వారిని పాండిచ్చేరి నుంచి మైసూర్ తరలించేందుకు సిద్ధమైపోతున్నాడు. ప్రస్తుతం పళని బలం 115కు చేరింది. బలపరీక్షలో గెలవాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో అరవ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. -
మాకు పూర్తి బలం ఉంది: అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే బలనిరూపణ అంశాన్ని కనుమరుగు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చెన్నైలో నేడు ఎమ్మెల్యేలందరితో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 12న నిర్వహించబోయే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కోసమే అని చెబుతున్నప్పటికీ.. సంఖ్యా బలం చూపించుకునేందుకే ఈ ఎమ్మెల్యేల సమావేశం విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. "ఎమ్మెల్యేల సమావేశానికి 111 మంది హాజరయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఓ ఎమ్మెల్యే హాజరుకాలేకపోయారు. మరికొందరు ఫోన్ ద్వారా మద్ధతు తెలిపారు. మా కూటమిలో ముగ్గురి మద్ధతు కూడా మాకే ఉంది. అందులో స్పీకర్ ధన్ పాల్ కూడా ఉన్నారు. ఈ లెక్కన్న మా పార్టీకి పూర్తి బలం ఉంది'' అని అన్నాడీఎంకే కీలక నేత, మంత్రి డీ జయకుమార్ సమావేశం అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అంతేకాదు మరో గ్రూప్ నుంచి కూడా 9 మంది మద్ధతు మాకే ఉందని, వారు ఫోన్ లో సంప్రదింపులు చేపట్టారని ఆయన అన్నారు. అయితే వాళ్లు దినకరన్ మద్ధతుదారులా? లేక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లా? అన్నది మాత్రం జయకుమార్ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే సమావేశానికి శశికళ-దికనరన్ వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. తాము హాజరుకాబోమని నిన్ననే ఆ వర్గ నేత తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి కూడా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సెల్వన్ స్పీకర్ ను ప్రశ్నిస్తున్నారు. వర్నర్ విద్యాసాగర్ ను కలసి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని తెలియజేయటం ద్వారా ఆ 19 మంది పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ధన్ పాల్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే.