dinner invitation
-
నాటు నాటుకి అమెరికన్ యువత స్టెప్పులు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందు సరదా సంభాషణలతో సందడిగా సాగింది. వైట్‌హౌస్ నార్త్ లాన్లో గురువారం రాత్రి ఈ విందుకు 400 మందికిపైగా అతిథుల్ని ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహేంద్ర, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తదితరులు ఈ విందుకి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ విందులో అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోదీతో సరదా సంభాషణలతో నవ్వులు పూయించారు. విందులో టోస్ట్ (ఆరోగ్యం కోసం తీసుకునే ఒక పెగ్గు ఆల్కహాల్) సంప్రదాయం గురించి బైడెన్ మాట్లాడుతూ ‘‘మిస్టర్ పీఎం మీరు ఎవరికైనా టోస్ట్ అందించాలనుకుంటే మీ చేతి గ్లాసులో ఆల్కహాల్ లేకపోతే ఎడమ చేత్తో వారికి ఇవ్వాలి. ఈ విషయాన్ని మా తాతయ్య చెప్పేవారు’ అని బైడెన్ అంటే మోదీ చిరునవ్వులు చిందించారు. బైడెన్, మోదీ ఇద్దరూ ఆల్కహాల్ తీసుకోరు. దీంతో అందరూ ఫక్కున నవ్వేశారు. బైడెన్ ఆతిథ్యానికి అతిథులందరూ ఫిదా అయిపోయి పాటలు పాడాలని అనుకుంటారని మోదీ అన్నారు. 2014లో అమెరికాకు వచ్చినప్పుడు నవరాత్రుల సందర్భంగా ఉపవాసం ఉండడంతో ఏమీ తినలేదని, అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్ తనని బాగా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. తాను తినాలన్న బైడెన్ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. అతిధులందరూ ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తీసుకోవాలంటూ మోదీ స్వయంగా టోస్ట్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికా మధ్య బంధాల బలోపేతంలో ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ‘భారతీయులు, అమెరికన్లు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుంటున్నారు. భారత్‌లో పిల్లలు హాలోవిన్ వేడుకల్ని చేసుకుంటూ స్పైడర్ మ్యాన్‌ను చూసి పులకించిపోతూ ఉంటే, అమెరికన్ యువత తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్లో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకి స్టెప్పులేస్తున్నారు’అని ప్రధాని పేర్కొన్నారు. అధికారిక విందులో మెనూ..! ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహారం, తృణధాన్యాలతో చేసిన వంటలను దగ్గరుండి మరీ జిల్ బైడెన్ వడ్డించారు. మారినేటెడ్ మిల్లెట్స్, గ్రిల్డ్ మొక్కజొన్న సలాడ్, పుచ్చకాయ జ్యూస్, అవకాడో సాస్, స్టఫ్డ్ మష్రూమ్స్, క్రీమీ రిసొట్టో, లెమన్ డిల్ యోగర్ట్ సాస్ వంటివి ప్రత్యేకంగా వడ్డించారు. -
కెనెడా ప్రధాని డిన్నర్.. ఉగ్రవాదికి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొనే విందు కోసం ఖలిస్తానీ ఉగ్రవాదికి ఆహ్వానం అందించటం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రూడో కోసం ఢిల్లీలోని కెనడా హైకమిషర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఓ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఖలీస్థాన్ ఉద్యమకారుడు జస్పల్ అట్వల్కు కెనడా రాయబార కార్యాలయం ఆహ్వానం పంపింది. మీడియాలో దీనిపై కథనాలు రావటంతో పంజాబ్ ప్రభుత్వం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. కెనడియన్ ఎంబసీ స్పందించింది. ఆయన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. 1986లో పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్దూపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో జస్పల్ను కోర్టు ఉగ్రవాదిగా తేల్చింది. ఈ కేసులో జస్పల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. జస్పల్ సభ్యుడిగా ఉన్న ఇంటర్నేషనల్ సిక్క్ యూత్ ఫెడరేషన్‌పై నిషేధం కూడా విధించబడింది. జైలు నుంచి బయటికొచ్చాక కెనడా రాజకీయాల్లో జస్పల్ క్రియాశీలకంగా వ్యవహరించటం ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తాయి.ఇక తాజాగా ట్రూడో హాజరయిన ముంబై ఈవెంట్లో సందడి చేసిన జస్పల్.. ట్రూడో భార్య సోఫీతో, కెనెడా మంత్రి అమర్జీత్ సోహితో ఫోటోలు కూడా దిగారు. -
సీఎం ఆహ్వానం.. రెండు వర్గాలుగా బీజేపీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పంపిన విందు ఆహ్వానం విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు వెళ్లాలని, మరికొందరు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. సీఎం నితీష్ అధికార నివాసంలో జరిగే డిన్నర్ పార్టీకి వెళతానని మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెప్పగా.. తాము వెళ్లబోమని ప్రతిపక్ష నేత ప్రేమ్ కుమార్, మరో సీనియర్ నేత నంద కిశోర్ యాదవ్ స్పష్టం చేశారు. సుశీల్ కుమార్‌తో పాటు బీజేపీకి చెందిన మరో 12 మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొననున్నారు. కాగా ఈ విందుకు ఎమ్మెల్యేలందరూ వెళ్లాలని బీజేపీ నాయకులు మొదట నిర్ణయించింది. అయితే 2010లో నితీశ్ తమతో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని మనసు మార్చుకున్నారు. అప్పట్లో పట్నాలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎల్ కే అద్వానీ, నరేంద్ర మోదీ హాజరైనపుడు.. ఆ పార్టీ నేతలకు పంపిన విందు ఆహ్వానాన్ని నితీష్ వెనక్కు తీసుకున్నారు. కాంట్రాక్టు టీచర్లు, ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జీ చేసినందుకు నిరసనగా సీఎం విందు ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు ప్రేమ్ కుమార్ చెప్పారు. ప్రేమ్ కుమార్, నంది కిశోర్ యాదవ్‌కు సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలు కూడా సీఎం ఆహ్వానాన్ని తిరస్కరించారు.