సమ్మెలో పాల్గొననున్న డిప్లొమో ఇంజినీర్లు
విజయవాడ: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న డిప్లొమో ఇంజినీర్లు సమైక్యాంధ్ర కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫ్యాక్స్ ద్వారా సమ్మె నోటీసు పంపారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రతినిధులు ఆదివారం ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఏఈ రియాజ్ అహ్మద్‌ను ఎన్నుకున్నారు.