director arrest
-
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దొంగ సంతకాలతో ఫ్లాట్‌ను అమ్మిన కేసులో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుమీత్ సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శామీర్‌పేట పోలీసులు బుధవారం సుమీత్ సేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేట సీఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం... ప్రజయ్ హోమ్స్ మాజీ సీఎండీ లేటు చంద్రమోహన్‌రెడ్డి భార్య హైమావతీరెడ్డికి మజీద్‌పూర్ గ్రామ పరిధిలో ప్రజయ్ హోమ్స్‌లోని తన 429 గజాల ఫ్లాట్‌ను దొంగ సంతకాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని సుమిత్ సేన్, విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమలపై ఈ నెల 16 న శామీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన శామీర్‌పేట పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమిత్ సేన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా ఫోర్జరీ చేసినట్లు ఆధారాలు లభించడంతో మంగళవారం రాత్రి కోర్టులో హాజరు పరిచి జైలుకి పంపినట్లు శామీర్‌పేట సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. పరారీలో మరో నలుగురు... ఇదే కేసులో మరో నలుగురు నిందితులు విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
‘ద్యావుడా’ డైరెక్టర్ అరెస్టు
హైదరాబాద్: ‘ద్యావుడా’ సినిమా డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో హిందూదేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్టు చేసిన డైరెక్టర్ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దాసరి సాయిరాం డైరెక్టర్‌గా, వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జెల హరి కుమార్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గాను ఇటీవల ద్యావుడా సినిమాను చిత్రీకరిస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. ఇందులో ఒక సన్నివేశంలో శివుడిపై అభ్యంతరకర సన్నివేశం ఉందంటూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భజరంగ్‌దళ్‌కు చెందిన యు. నవీన్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు. కాగా కర్ణాటక, ఉజ్జయినిలోని దేవాలయాల్లో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉందని, వాటి స్ఫూర్తిగానే తాను సినిమాలో అటువంటి సన్నివేశాలను ఉంచినట్లు సాయిరాం విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా, ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని యూట్యూట్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడని వివరించారు. -
నటిపై దర్శకుడు అత్యాచారం
థానె: పాకిస్థాన్‌కు చెందిన ఓ నటి (30)ని అత్యాచారం చేసి, మోసం చేసిన కేసులో భోజ్‌పురి దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడికి సహకరించారనే ఫిర్యాదుపై అతని దగ్గర పనిచేసే ఇద్దరు సహాయ దర్శకులను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ బావ్చే చెప్పారు. గత మూడేళ్లుగా దర్శకుడికి పాక్ నటితో పరిచయమున్నట్టు పోలీస్ అధికారి చెప్పారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేసినట్టు తెలిపారు. సినిమా నిర్మించేందుకుగాను ఆమె నుంచి 35.80 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, ఈ సొమ్మును తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కాగా నిందితుల పేర్లను బయటపెట్టలేదు. -
'కూల్ బాయ్స్ హాట్ గళ్స్' డైరెక్టర్ అరెస్ట్
విశాఖ : పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఉద్యోగులు పేరుతో రూ. 17 లక్షలు మేరకు మోసం చేసిన కేసులో 'కూల్ బాయ్స్ - హాట్ గాళ్స్' సినిమా దర్శకుడితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, జూనియర్ ఆర్టిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రగంటి క్రియేటివ్ మూవీస్ పతాకంపై దేవుడు దర్శకత్వంలో కూల్ బాయ్స్ హాట్ గాళ్స్ చిత్రాన్ని ఐ.ఎన్.రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.