నటిపై దర్శకుడు అత్యాచారం | Bhojpuri film director arrested for 'raping' Pak actress | Sakshi
Sakshi News home page

నటిపై దర్శకుడు అత్యాచారం

Published Sat, Feb 20 2016 11:31 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

నటిపై దర్శకుడు అత్యాచారం - Sakshi

నటిపై దర్శకుడు అత్యాచారం

థానె: పాకిస్థాన్కు చెందిన ఓ నటి (30)ని అత్యాచారం చేసి, మోసం చేసిన కేసులో భోజ్పురి దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడికి సహకరించారనే ఫిర్యాదుపై అతని దగ్గర పనిచేసే ఇద్దరు సహాయ దర్శకులను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ బావ్చే చెప్పారు.

గత మూడేళ్లుగా దర్శకుడికి పాక్ నటితో పరిచయమున్నట్టు పోలీస్ అధికారి చెప్పారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేసినట్టు తెలిపారు. సినిమా నిర్మించేందుకుగాను ఆమె నుంచి  35.80 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, ఈ సొమ్మును తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కాగా నిందితుల పేర్లను బయటపెట్టలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement