కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం
∙‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ రాజు
∙ఆత్రేయపురం వెంకన్నకు పూజలు
ఆత్రేయపురం: (కొత్తపేట) :
కుటుంబ కథా చిత్రాలకే అధిక ప్రాధాన్యమి స్తానని శతమానం భవతి సినిమా డైరెక్టర్ వేగేశ్న సతీష్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లమ్మ, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో కుంకుమ పూజలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ 45 చిత్రాలకు కథ, మాటలు రాసి, స్క్రీ¯ŒS ప్లే చిత్రీకరించడంతో పాటు డైరెక్టర్‌గా శతమానం భవతి మంచి హిట్‌ను అందించడంతో సతీష్రాజును క్షత్రియ యూత్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురంతో ఎంతో ఆత్మీయబంధం ఉందన్నారు. అందుకే శతమానం భవతి సినిమాలో ఆత్రేయపురం పేరుతో సినిమా రూపొందించడం సెంట్‌మెంట్‌గా భావిస్తున్నానని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరు తన స్వగ్రామమని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ కథా చిత్రాలపై దృష్టి సారించానని తెలిపారు. ప్రస్తుతం దిల్‌రాజ్ నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు.
ఆలయంలో ఘన స్వాగతం..
శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సతీష్ రాజుకు నిర్మాత పాతపాటి సత్యనారాయణరాజు (రమణరాజు) ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వామి వారి ఫొటోను ఆలయ నిర్మాత రమణరాజు ఆయనకు అందజేశారు. అనంతరం గ్రామంలో ‘వేగేశ్న’ వారి ఇంట్లో భోజనం చేసి, బంధుమిత్రులతో కాలక్షేపం చేశారు. సతీష్ రాకతో ఆయన అభిమానులు తరలివచ్చి ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు.
విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు
అయినవిల్లి : విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వేగేశ్న సతీష్ మంగళవారం పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకుడు సూరిబాబు, చైర్మ¯ŒS సుబ్బరాజు స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు.