Director Suresh
-
ఆంధ్రాబ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలు
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘అవినీతి నిర్మూలన, సమైక్యతా భావన పెంపులో ప్రజల భాగస్వామ్యం’అన్న అంశంపై అవగాహన సదస్సులు, పలు కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ సురేష్ ఎన్.పటేల్ బ్యాంక్ అధికారులు, ఉద్యోగులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ వారం పాటు గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
‘శ్రీనిలయం’లో ఏం జరిగింది?
యోగేశ్, నేహా దేశ్ పాండే జంటగా సురేశ్ దర్శకత్వంలో హేమంత్ నల్లూరి నిర్మించిన చిత్రం ‘శ్రీ నిలయం’. ఈ చిత్రం టైటిల్ లోగో, ప్రచార చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర ఆవిష్కరించారు. బేనర్ లోగోను నల్లూరి ప్రశాంతి విడుదల చేశారు. పాతిక రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారని విని, ఆశ్చర్యపోయానని అనిల్ సుంకర పేర్కొన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత చెప్పారు. రెండు గంటలపాటు ఉత్కంఠగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్లస్ అయ్యే చిత్రం ఇదనీ, దర్శకుడు సురేశ్‌తో పదేళ్లుగా పరిచయం ఉందనీ, ఆయన సినిమా ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందని యోగేశ్ చెప్పారు. మంచి పాత్ర చేశానని నేహా దేశ్ పాండే అన్నారు.