‘శ్రీనిలయం’లో ఏం జరిగింది? | Sri nilayam movie Benar logo Release | Sakshi
Sakshi News home page

‘శ్రీనిలయం’లో ఏం జరిగింది?

Published Wed, Sep 3 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

‘శ్రీనిలయం’లో ఏం జరిగింది?

‘శ్రీనిలయం’లో ఏం జరిగింది?

 యోగేశ్, నేహా దేశ్ పాండే జంటగా సురేశ్ దర్శకత్వంలో హేమంత్ నల్లూరి నిర్మించిన చిత్రం ‘శ్రీ నిలయం’. ఈ చిత్రం టైటిల్ లోగో, ప్రచార చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర ఆవిష్కరించారు. బేనర్ లోగోను నల్లూరి ప్రశాంతి విడుదల చేశారు. పాతిక రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారని విని, ఆశ్చర్యపోయానని అనిల్ సుంకర పేర్కొన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత చెప్పారు. రెండు గంటలపాటు ఉత్కంఠగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్లస్ అయ్యే చిత్రం ఇదనీ, దర్శకుడు సురేశ్‌తో పదేళ్లుగా పరిచయం ఉందనీ, ఆయన సినిమా ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందని యోగేశ్ చెప్పారు. మంచి పాత్ర చేశానని నేహా దేశ్ పాండే అన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement