‘విపత్తుల దళం’ ఏర్పాటుకు ప్రతిపాదనలు
► కేంద్రం మొట్టికాయలతో రాష్ట్రంలో కదలిక
హైదరాబాద్: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేంద్రం మొట్టికాయలు వేయడంతో ఉన్నతా ధికారులు స్పందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర సహాయ పరిస్థితుల్లో సహాయచర్యల కోసం పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను 2005లో కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతీ రాష్ట్ర ప్రభు త్వం తమ పరిధిలోనూ రాష్ట్ర డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొంది.
కానీ, ఉమ్మడి ఏపీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోవడంతో 2013లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు ఉమ్మడి ఏపీ తోపాటు మరో 6 రాష్ట్రాలకు నోటీసులు జారీ అయ్యాయి. త్వరలోనే ఏర్పాటు చేస్తామని గతంలోని ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అఫిడ విట్ దాఖలు చేశాయి. దీనిపై ఇటీవల కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్ ఎందుకు ఏర్పాటు చేయ లేదని తెలంగాణ, ఏపీలకు మొట్టికాయలు వేసింది. దీంతో ఉన్నతాధికారులు తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర అగ్ని మాపక శాఖ నేతృత్వంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్లోని సిబ్బంది, పోలీస్ శాఖలో ని బెటాలియన్ సిబ్బందిని 8 బృందాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఎన్ డీఆర్ఎఫ్ రీతిలో పనిచేసేందుకు ఇవ్వాల్సిన శిక్షణ, కావల్సిన నిధులు, వాహనాలు, పరిక రాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. ఈ విభాగం ఏర్పడితే పోలీస్ శాఖ కింద లేక అగ్నిమాపక శాఖ కింద పనిచే యాల్సి ఉంటుందా అన్న అంశాలపై 2 విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది.