discharges from hospital
-
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రణధీర్ కపూర్
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, కరీష్మా కపూర్ల తండ్రి,నటుడు రణధీర్ కపూర్ (74) కరోనా నుంచి కోలుకున్నారు. గత నెలలో కరోనాతో ఏప్రిల్ 29న కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రణధీర్ కపూర్‌కు ఐసీయూకి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. కరోనా రెండవ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆయనకు కరోనా సోకింది. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రణ్‌ధీర్ కపూర్ ప్రస్తతం తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఇంట్లోనే కొద్ది రోజులు క్వారంటైన్లో ఉండమని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. ఇక 5 రోజుల పాటు తనకు సేవలందించిన ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు తనను ఎంతో బాగా చూసుకున్నారని చెప్పారు. ఇక రణధీర్ కపూర్ ఇంటికి చేరుకోవడంతో కపూర్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చదవండి : 'ఆ సీరియల్ నటుడితో ప్రియాంకకు పెళ్లి చేయాలనుకున్నారట' నేను చనిపోలేదు.. 7 తర్వాత కూడా నిద్రపోయా: పరేశ్ రావల్ -
మారడోనా డిశ్చార్జి
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా సాకర్ దిగ్గజం, 1986 ఫుట్‌బాల్ ప్రపంచకప్ చాంపియన్ కెప్టెన్ డీగో మారడోనా ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి అయ్యాడు. ఈ విషయాన్ని అతని వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుఖ్ వెల్లడించారు. మెదడులోని నాళాల మధ్య రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో మారడోనాకు గత వారం ‘సబ్డ్యూరల్ హెమటోమా’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటికీ అతను కోలుకునేందుకు ఇంటివద్ద చికిత్స కొనసాగిస్తామని లుఖ్ చెప్పారు. ఇటీవలే 60వ పడిలో అడుగుపెట్టిన మారడోనా... తొలుత డిప్రెషన్, ఎనీమియా, డీహైడ్రేషన్ లక్షణాలతో ‘లా ప్లాటా’ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం సబ్డ్యూరల్ హెమటోమా నిర్ధారణ కావడంతో అతన్ని స్థానిక ఓలివోస్ క్లినిక్‌లో చేర్పించి వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. -
ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్
సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 62,228 మంది కరోనా బారిన పడగా 26,997 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజులోనే 8,381 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరిలో ముంబై నుంచే 7,358 మంది ఉన్నారు. ముంబైలో ఇప్పటి వరకు 16,008 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,133 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అదేవిధంగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,325కు చేరగా ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. షిర్డీలో తొలి కరోనా కేసు షిర్డీకి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో పట్టణాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వచ్చే 14 రోజులపాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. -
దీపావళి తర్వాతనే జయ డిశ్చార్జి!
డాక్టర్ రిచర్డ్ అనుమతి కోసం నిరీక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో 37 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపావళి పండుగలోగా డిశ్చార్జి అయ్యేలా లేరు. పండుగ ఈ నెల 29, 30 తేదీలు కాగా అమ్మ డిశ్చార్జిపై 27న ఒక ప్రకటన వెలువడచ్చని అపోలో వర్గాలు గతంలో తెలిపాయి. పండుగ సమీపిస్తున్నా ప్రకటనరాకపోవడంతో దీపావళి తరువాతనే డిశ్చార్జి అని భావించాల్సి వస్తోంది. అపోలో వైద్యులు ఇప్పటివరకు జయలలితకు జరిగిన చికిత్సకు సంబంధించి శుక్రవారం క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఈ మెయిల్ ద్వారా లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ పరిశీలనకు పంపారు. రిచర్డ్ నివేదికను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పుడే అమ్మను డిశ్చార్జి చేయాలని అపోలో వైద్యులు నిర్ణయానికి వచ్చారు. దీంతో అమ్మ దీపావళి తరువాతనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.