Discrimination against girls
-
అతివలకే సింహభాగం
గుడుంబా నిర్మూలనతోనే సమస్యలకు పరిష్కారం ‘సర్వోదయ’ మహిళా దినోత్సవంలో ఎంపీ దయాకర్ ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు : ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంగెం(పరకాల) : పూర్వ కాలంలో వంటింటికే పరిమితమైన మహిళలకు ఇప్పుడు అన్ని రంగాల్లో సింహభాగం దక్కుతోందని.. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ వారు దూసుకువెళ్తున్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీ దయాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభ కనబరుస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గుడుంబా మహమ్మారి కారణంగా చిన్నవయస్సులోనే పలువురు వితంతువులుగా మారి దుర్భరజీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గుడుంబా నిర్మూలన జరిగిందని ఆయన అనగా.. ఇంకా పూర్తిగా బంద్ కాలేదని సభికుల నుంచి కొందరు చెప్పారు. దీంతో ఎంపీ స్పందిస్తూ పూర్తిస్థాయిలో నిర్మూలిస్తే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మహిళలు చైతన్యవంతులైనే అభివృద్ధి మహిళలు చైతన్యవంతులైతేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కుటుంబ సంక్షేమంతో పాటుగా పిల్లలు, భర్త సమాజంలో రాణింపు వెనక భార్య హస్తం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతీ ఒక్కరూ ఆడపిల్లల పట్ల వివక్షత చూపొద్దని కోరారు. గ్రామాల్లో గుడుంబా నిర్మూలన బాధ్యత పూర్తిగా మహిళలదేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పథకాలు మహిళల పేరునే మంజూరు ఇస్తున్నారని తెలిపారు. మహిళలు సంఘటితంగా ఉండి ప్రభుత్వ పథకాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. మరుగుదొడ్లు తమ ఆత్మగౌరవానికి భావించి ప్రతీ ఇంట్లో నిర్మించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలకు నిర్వహించిన ఆటపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుగులోత్ వీరమ్మ, ఎంపీపీ బొమ్మల కట్టయ్య, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ భద్రునాయక్, సర్పంచ్ మల్లికాంబ, ఎంపీటీసీ సభ్యులు కళావతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సర్వోదయ సంస్థ కార్యదర్శి పల్లెపాడు దామోదర్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు. -
ఆడపిల్లపై వివక్ష ఎందుకు?
ఇందూరు : ‘ఆడబిడ్డ పుడితే మానసికంగా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడంలేదు.. బిడ్డను కనే తల్లి కూడా ఒకప్పుడు ఒక తల్లికి పుట్టిన ఆడబిడ్డేనన్న విషయం మరిచిపోయి గర్భంలోనే ఉండగానే ఆడపిల్లలను చంపుకుంటున్నారు..’ అని జిల్లా అదనపు కలెక్టర్ (ఏజేసీ) శేషాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఐసీడీఎస్ అనుబంధ శాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం, తదితర సంబంధిత శాఖల సమన్వయంతో బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హా జరైన ఏజేసీ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడప్లిల పుడితే ఏమవుతుందన్నారు. తల్లి దండ్రులను చివరి వరకు ప్రేమించేది కొడుకు కాదని కూతురేనన్నారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లినంత మాత్రానా కూతురు తల్లి దండ్రులను మరిచిపోదన్నారు. కానీ ఈ కాలంలో కొడుకులు కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారని అన్నారు. బరువయ్యారని ఆశ్రమంలో ఉంచిన కొడుకు గొప్పవాడా...? చివరి వరకు ప్రేమించి యోగ క్షేమాలు చూసుకునే కూతురు గొప్పదా.? అని ప్రశ్నించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆడబిడ్డను కనే తల్లి ముందస్తు పరీక్షలు చేయించుకుని ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని కడుపులోనే చంపేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉం దని, కానీ ఆడవాళ్లే ఆడవాళ్లకు ఇలా శత్రువులుగా మారడం దారుణమైన విషయమన్నారు. ఆడవాళ్లలో మార్పు వస్తే భ్రూణ హత్యలు తగ్గుతాయన్నారు. ఆడవాళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కిశోర బాలికలు, కల్యాణ లక్ష్మి లాంటి ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల హక్కులను హరించొద్దు పిల్లల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని, అలా హరించిన వారెవరైనా, చివరికీ కన్న తల్లిదండ్రులైనా చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే షాపు యజమానిపై కేసు నమోదుతో పాటు జైలు శిక్ష విధిస్తారనిహెచ్చరించారు. కార్యక్రమం అనంతరం సంతానం కలుగని దంపతులకు ఏడాదిన్నర పాపను ఏజేసీ చేతుల మీదుగా దత్తతనిచ్చారు. ఉపాన్యాస, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాల్య వివాహాల నిరోధకాలపై, బాల స్వచ్ఛ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాసాచారి, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెర్టరేట్ నుంచి విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి తిలక్‌గార్డెన్ మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు చేరుకుంది. -
బాలికలపై వివక్ష తగదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: బాలికలపై వివక్ష తగదని జిల్లాలోని బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయూల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ రాష్ట్ర సదన్‌లో నిర్వహించిన ‘బేటీ బచావో-బేటీ పడా వో’ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలికల నిష్పత్తి నానాటికి తగ్గుతుందన్నారు. మనకంటే వెనకబడిన దేశాలైన శ్రీలంక, నేపాల్, అప్ఘనిస్తాన్, మయన్మార్‌లలో కూడా బాలికల నిష్పత్తి మెరుగ్గా ఉందని తెలిపారు. సమాజంలో బాల, బాలికలు సమానమే అరుునా మహిళలకు రోజూ ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేశారు. బాల,బాలికలకు సమానంగా చదువు నేర్పించాలని ఏ ఒక్కరిపైనా వివక్ష చూపరాదన్నారు. జిల్లా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ స్కానింగ్ సెంట ర్లపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మిహ ళా చట్టాలను పకడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఆడపిల్ల అభివృద్ధికి చేపట్టిన పథకాలపై విస్తృ త ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీని సమీక్షించాలన్నారు. జిల్లాలో దాదాపు 10వేల మంది బడిఈడు పిల్లలు బడిబయట ఉన్నారని, వారిని పాఠశాలల్లో చేర్పించేం దుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాలికలకు ఆహారం, వసతి, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజేసీ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా రూపొం దించిన ‘బంగారు తల్లి’, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఇందిర, డీఎంఅండ్‌హెచ్‌ఓ సరస్వతి, సమితి ప్రతినిధులు శ్రీధర్, విజయలక్ష్మి, సిడిపిఓలు పాల్గొన్నారు. అంతకు ముందు శిశువిహార్‌లో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడి గి తెలుసుకున్నారు. చిన్నారులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అదేశించారు.