బాలికలపై వివక్ష తగదు | discrimination against girls | Sakshi
Sakshi News home page

బాలికలపై వివక్ష తగదు

Sep 10 2014 3:34 AM | Updated on Sep 2 2017 1:07 PM

బాలికలపై వివక్ష తగదు

బాలికలపై వివక్ష తగదు

బాలికలపై వివక్ష తగదని జిల్లాలోని బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయూల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు.

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: బాలికలపై వివక్ష తగదని జిల్లాలోని బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయూల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ రాష్ట్ర సదన్‌లో నిర్వహించిన ‘బేటీ బచావో-బేటీ పడా వో’ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యూరు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలికల నిష్పత్తి నానాటికి తగ్గుతుందన్నారు. మనకంటే వెనకబడిన దేశాలైన శ్రీలంక, నేపాల్, అప్ఘనిస్తాన్, మయన్మార్‌లలో కూడా బాలికల నిష్పత్తి మెరుగ్గా ఉందని తెలిపారు. సమాజంలో బాల, బాలికలు సమానమే అరుునా మహిళలకు రోజూ ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేశారు. బాల,బాలికలకు సమానంగా చదువు నేర్పించాలని ఏ ఒక్కరిపైనా వివక్ష చూపరాదన్నారు.
 
జిల్లా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ స్కానింగ్ సెంట ర్లపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మిహ ళా చట్టాలను పకడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఆడపిల్ల అభివృద్ధికి చేపట్టిన పథకాలపై విస్తృ త ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో  విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీని సమీక్షించాలన్నారు. జిల్లాలో దాదాపు 10వేల మంది బడిఈడు పిల్లలు బడిబయట ఉన్నారని, వారిని పాఠశాలల్లో చేర్పించేం దుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
 
బాలికలకు ఆహారం, వసతి, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజేసీ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా రూపొం దించిన ‘బంగారు తల్లి’, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఇందిర, డీఎంఅండ్‌హెచ్‌ఓ సరస్వతి, సమితి ప్రతినిధులు శ్రీధర్, విజయలక్ష్మి, సిడిపిఓలు పాల్గొన్నారు. అంతకు ముందు శిశువిహార్‌లో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడి గి తెలుసుకున్నారు. చిన్నారులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement