Disha committee
-
బుల్లెట్ల శబ్దం వినిపించిందా?.. లేదు ఆ సమయంలో నిద్రపోతున్నా!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 2019 డిసెంబర్ 5న నిందితులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో దిశ మృతదేహాన్ని కాల్చే సిన ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన వాహనం డ్రైవర్ యాదగిరిని గురువారం త్రిసభ్య కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా? అని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ‘లేదు, ఆ సమయంలో నేను వాహనంలోనే పడుకున్నా’అని డ్రైవర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో మరణించిన నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృపాల్ గుప్తా, బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తాలను కూడా కమిషన్ విచారించింది. మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించలేదని కృపాల్ గుప్తాను ప్రశ్నించగా.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇవ్వలేదని పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మృతదేహాలపై ఏమైనా గాయాలున్నాయా అని ప్రశ్నించగా.. లేవని కృపాల్ సమాధానమివ్వగా, సుధీర్ గుప్తా మాత్రం మృతదేహాలపై పోలీసులు కొట్టినట్లు గాయాలున్నాయని చెప్పినట్లు సమాచారం. శుక్రవారం కూడా గాంధీ ఆసుపత్రి వైద్యుల విచారణ కొనసాగనుంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది. చదవండి: Tollywood Junior Artists: ప్రియుడు మోసం చేయడంతో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న ఐపీఎస్ సజ్జనార్
-
వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ విడుదల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్’ను విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లపై ...మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్ నేరాలపై మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్ సుయజ్ పాల్గొన్నారు. -
‘దిశ’ పథకం అమలుకు రూ.47.93 కోట్ల నిధులు
సాక్షి, అమరావతి: దిశ పథకం అమలుకు పాలనా అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.47.93 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోంశాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ ఆదేశాల నేపథ్యంలో పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో ఏడుగురు అధికారులు, సిబ్బంది ఉంటారని తెలిపారు. ‘దిశ’ చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. -
దేశానికి దిశ నిర్దేశం
-
మహిళల రక్షణకు దిశ పోలీస్స్టేషన్లు
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు, చట్టం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్న దృష్ట్యా దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం క్రైం: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు, చట్టం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్న దృష్ట్యా దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. దిశ చట్టంపై కేంద్ర నుంచి అనుమతులు రాకపోయినా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లో దర్యాప్తుతో పాటు ఫోరెన్సిక్ లేబొరేటరీలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేయాలని చట్టంలో ఉంది. దీని ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. దిశ యాప్‌ను, మహిళల రక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. షీ టీమ్ మహిళా మిత్ర ప్రోగ్రాంలో భాగంగా దిశ చట్టంలో మరింత మెరుగైన చట్టాలు, చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్ఏ ఖాన్, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షీమూషీ బాజ్‌పేయి, జిల్లా ఎస్పీ నయీం అస్మీ, ఓఎస్డీ అమిత్ బర్ధన్, అడిషనల్ ఎస్పీ లతామాధురి, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘నన్నయ’లో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటనకు సంబంధించి ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న దిశ పోలీసు స్టేషన్లకు సంబంధించిన అధికారులు, సిబ్బందికి ఈనెల 7న ‘నన్నయ’ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటరులో ఒకరోజు వర్క్‌షాప్ జరగనుంది. రాజమహేంద్రవరం నుంచి ‘నన్నయ’ యూనివర్సిటీకి చేరుకున్న అనంతరం సీఎం వర్క్‌షాప్‌ను సందర్శించి, సిబ్బంది, లాయర్లను ఉద్దేశించి మాట్లాడతారు. దిశ యాప్, పోలీసు స్టేషన్లకు సంబంధించి విధివిధానాలతో కూడిన బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తారని డీజీపీ తెలిపారు. యూనివర్సిటీలో వర్క్‌షాప్ జరిగే కన్వెన్షన్ సెంటర్ భవాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి కొన్ని సూచనలిచ్చారు. ‘నన్నయ’కు సీఎం రావడం సంతోషకరం యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో సుమారు 70 శాతం మంది మహిళలేనని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎం.జగన్నాథరావు తెలిపారు. మహిళ విద్యార్థులే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంగణానికి మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్‌ని ప్రారంభించేందుకు సీఎం జగన్ విచ్చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్, అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీబాజ్పేయ్, అదనపు ఎస్పీలు లతతామాధురి, మురళీకృష్ణ, రమణకుమార్, డీఎస్పీ ఏటీవీ రవికుమార్, శ్రీనివాసరెడ్డి, సీఐ సుభాష్, తదితరులు ఉన్నారు. -
అధికారుల గైర్హాజరుపై అసహనం
సమీక్ష సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు ‘దిశ’ తొలి సమావేశంలో ప్రజాప్రతినిధులు కమిటీ మార్గదర్శకాలు తెలియజేయాలని ఎంపీ ఆదేశం హన్మకొండ : సమీక్ష సమావేశాలు, జిల్లా, మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరయ్యే అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు కోరారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశం మందిరంలో శనివారం ‘దిశ’ తొలి సమీక్ష సమావేశం జరిగింది. గతంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఉండగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ(దిశ)గా మార్చింది. ఈ మేరకు కమిటీ సమావేశాలు ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, ఫిబ్రవరిలో కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. అయితే, తొలి సమావేశాన్ని ఆగస్టు 13న నిర్వహించాలన్న సూచనలతో శనివారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. అయితే, పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సమావేశానికి రూ.2లక్షలు ‘దిశ’ కమిటీ మార్గదర్శకాలతో పాటు ఏయే శాఖలపై సమీక్ష ఉంటుందో వచ్చే సమావేశంలోగా అధికారులు, సభ్యులైన ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ప్రతీ సమావేశానికి ప్రభుత్వం రూ.2 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. ప్రజాప్రతినిధులకు రవాణ ఖర్చులు వీటి నుంచి చెల్లిస్తారన్నారు. ఈ కమిటీ పరిధిలోకి 28 శాఖలు వస్తాయని, వీటిపై ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించనున్నట్లు చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తిరిగి వచ్చేలా పార్లమెంట్ సభ్యులు కృషి చేయాలన్నారు. జిల్లాను అభివృద్ధి బాట పట్టిద్దామన్నారు. కాగా, సమావేశం ప్రారంభం కాగానే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ చేస్తున్న పనులన్ని కాగితాలపై లెక్కలుగానే మిగులుతున్నాయని, క్షేత్రస్థాయిలో కనపడడం లేదని విమర్శించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ గ్రానైట్ లీజ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, తక్కుల విస్తీర్ణానికి రాయల్టీ చెల్లించి ఆక్రమణలకు పాల్పడుతు పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు దున్నపోతు మీద నీళ్లు పోసినట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాకు అధికారాలు లేవా? ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు అధికారాలు లేకుండా పోయాయని సమావేశంలో పలువురు ఎంపీపీలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పలు కార్యక్రమాల వివరాలు చెప్పడం లేదని ఆరోపించారు. దీంతో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ కలగజేసుకుని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎంపీపీలకు అందించాలని ఆదేశించారు. రక్షిత మంచినీ టి పథకా(సీడీడబ్ల్యూఎస్)ల విద్యుత్ బిల్లు లు చెల్లించడానికి నిధులు లేవని, దీంతో పథకాలు మూసివేయాల్సి వస్తోందని ఎంపీపీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కేంద్రప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా జీపీలకు ఇస్తుండడంతో జెడ్పీలో నిధులు లేక ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా రాష్ట్రప్రభుత్వం బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో మూసివేస్తున్నట్లు బోర్డులు పెట్టాలని ఎంపీపీ రవీందర్రావు అనగానే... ఎంపీ సీతారాంనాయక్ సైతం బోర్డు పెట్టాలని అన్నారు. అనంతరం తేరుకున్న ఆయన నిధులు వచ్చేలా కృషి చేద్దామన్నారు. అనంతరం జేసీ జీవన్‌పాటిల్ మాట్లాడుతూ మండల సమావేశాలకు హాజరుకాని అధికారుల వివరాలు ఎంపీడీఓల ద్వారా తెప్పించుకుని వారిపై చర్య తీసుకోవాలని జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్‌ను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ ఆహ్మద్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఈఓ రాజీవ్, వ్యవసాయ శాఖ జేడీ ఉషాదయాళ్, పీఆర్ ఎస్ఈ సత్తయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ రాంచంద్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శివరాం పాల్గొన్నారు.