రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు, చట్టం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్న దృష్ట్యా దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
రాజమహేంద్రవరం క్రైం: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు, చట్టం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్న దృష్ట్యా దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. దిశ చట్టంపై కేంద్ర నుంచి అనుమతులు రాకపోయినా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తుతో పాటు ఫోరెన్సిక్ లేబొరేటరీలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేయాలని చట్టంలో ఉంది. దీని ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. దిశ యాప్‌ను, మహిళల రక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. షీ టీమ్ మహిళా మిత్ర ప్రోగ్రాంలో భాగంగా దిశ చట్టంలో మరింత మెరుగైన చట్టాలు, చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్‌ఏ ఖాన్, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షీమూషీ బాజ్‌పేయి, జిల్లా ఎస్పీ నయీం అస్మీ, ఓఎస్డీ అమిత్ బర్ధన్, అడిషనల్ ఎస్పీ లతామాధురి, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘నన్నయ’లో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించి ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న దిశ పోలీసు స్టేషన్లకు సంబంధించిన అధికారులు, సిబ్బందికి ఈనెల 7న ‘నన్నయ’ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటరులో ఒకరోజు వర్క్‌షాప్ జరగనుంది. రాజమహేంద్రవరం నుంచి ‘నన్నయ’ యూనివర్సిటీకి చేరుకున్న అనంతరం సీఎం వర్క్‌షాప్‌ను సందర్శించి, సిబ్బంది, లాయర్లను ఉద్దేశించి మాట్లాడతారు. దిశ యాప్, పోలీసు స్టేషన్లకు సంబంధించి విధివిధానాలతో కూడిన బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తారని డీజీపీ తెలిపారు. యూనివర్సిటీలో వర్క్‌షాప్ జరిగే కన్వెన్షన్ సెంటర్ భవాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి కొన్ని సూచనలిచ్చారు.
‘నన్నయ’కు సీఎం రావడం సంతోషకరం
యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో సుమారు 70 శాతం మంది మహిళలేనని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎం.జగన్నాథరావు తెలిపారు. మహిళ విద్యార్థులే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంగణానికి మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్‌ని ప్రారంభించేందుకు సీఎం జగన్ విచ్చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్, అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీబాజ్‌పేయ్, అదనపు ఎస్పీలు లతతామాధురి, మురళీకృష్ణ, రమణకుమార్, డీఎస్పీ ఏటీవీ రవికుమార్, శ్రీనివాసరెడ్డి, సీఐ సుభాష్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment