disrespect
-
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: కెనడాలో బ్రాంప్టన్ నగరంలో ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ఉత్సవాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఒక శకటంపై ప్రదర్శిస్తూ 5కి.మీ మేర ర్యాలీ చేసి భారతదేశ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించారు. దీనిపై స్పందిస్తూ ఈ హేయమైన చర్యకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రాష్ట్ర వ్యవహారాల మంత్రి మీనాక్షి లేఖి. పాశవికమైన చర్య.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఒకరిని హత్య చేయడమనేది నేరంగానే పరిగణిస్తారు. ఇలా వేరొకరి హత్యను బట్టి ఆనందిస్తూ సంబరాల్లా జరుపుకోవడం పాశవికం. దీన్ని శాంతిభద్రతల ఉల్లంఘనగా పరిగణించి కెనడా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం.. అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ హేయమైన చర్యపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇటువంటి చర్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదన్నారు. ఈ సంఘటన వెనుక అంతర్లీనంగా మరో కారణం దాగుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఎవరైనా ఇలాంటి దారుణానికి ఒడిగడతారా? ఇది వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారి చర్యే. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలకు కెనడా దేశానికి కూడా మంచిది కాదని అన్నారు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
వైట్‌హౌస్‌లో సభ్యత మరిచిన ట్రంప్ సహాయిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు.. ఆయన సహాయకులు, పాలక వర్గం కూడా కాసింత వివాదాలకు తావిచ్చే మనుషులేనని మరోసారి స్పష్టమైంది. అమెరికా శ్వేతసౌదాన్ని అక్కడి వారు ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటిది సాక్షాత్తు ట్రంప్ ఆయన వర్గమంతా ఓ ఫొటోకు పోజిస్తుండగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ సలహాదారురాలు కెల్యానే కాన్వే కాస్తంత అమార్యదకు నడుచుకున్నారు. శ్వేత సౌదంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుని సరదాగా నవ్వుతూ కనిపించారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించపోయినా ఓ ఫొటో గ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఇప్పుడది బయటకు రావడంతో ఆమెపై ట్విట్టర్లో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్ హౌస్ అంటే కనీసం మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా మోకరిల్లి కూర్చోవడంపై మండిపడుతున్నారు. ‘ఓవెల్ ఆఫీసులు కనీసం తన షూ కూడా విప్పకుండా కాన్వే అలా సోఫాలో మోకరిల్లి కూర్చుకోవడం ట్రంప్ టీం పాటించే కనీస గౌరవ మర్యాదల విలువ ఏమిటో తెలియజేస్తోంది’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ ఫొటోలో ఎంతోమంది ఉన్నతశ్రేణి నల్లజాతీయులు నిల్చొని ఉండి ట్రంప్‌తో ఫొటో దిగుతున్న సమయంలో కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చోవడంపై మండిపడుతున్నారు. వేలల్లో కాన్ వే చర్యపై ట్విట్టర్లో ట్వీట్లు పేలాయి.