వైట్‌హౌస్‌లో సభ్యత మరిచిన ట్రంప్ సహాయిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు.. ఆయన సహాయకులు, పాలక వర్గం కూడా కాసింత వివాదాలకు తావిచ్చే మనుషులేనని మరోసారి స్పష్టమైంది. అమెరికా శ్వేతసౌదాన్ని అక్కడి వారు ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటిది సాక్షాత్తు ట్రంప్ ఆయన వర్గమంతా ఓ ఫొటోకు పోజిస్తుండగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ సలహాదారురాలు కెల్‌యానే కాన్‌వే కాస్తంత అమార్యదకు నడుచుకున్నారు.
శ్వేత సౌదంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుని సరదాగా నవ్వుతూ కనిపించారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించపోయినా ఓ ఫొటో గ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఇప్పుడది బయటకు రావడంతో ఆమెపై ట్విట్టర్‌లో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్ హౌస్ అంటే కనీసం మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా మోకరిల్లి కూర్చోవడంపై మండిపడుతున్నారు.
‘ఓవెల్ ఆఫీసులు కనీసం తన షూ కూడా విప్పకుండా కాన్‌వే అలా సోఫాలో మోకరిల్లి కూర్చుకోవడం ట్రంప్ టీం పాటించే కనీస గౌరవ మర్యాదల విలువ ఏమిటో తెలియజేస్తోంది’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ ఫొటోలో ఎంతోమంది ఉన్నతశ్రేణి నల్లజాతీయులు నిల్చొని ఉండి ట్రంప్‌తో ఫొటో దిగుతున్న సమయంలో కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చోవడంపై మండిపడుతున్నారు. వేలల్లో కాన్ వే చర్యపై ట్విట్టర్‌లో ట్వీట్లు పేలాయి.