వాషింగ్టన్: తాను ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. తొలిసారి ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదితో సమావేశమైన ఆయన ఈమేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించి తీరుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం అబాదికీ డోనాల్డ్ ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ఆతిథ్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇరాక్‌కు ట్రంప్ గట్టి మద్దతిచ్చారని, తాము కూడా దానిని తుదముట్టించి తీరుతామని అబాదీకి హామీ ఇచ్చినట్లు శ్వేతసౌదం పేర్కొంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరాక్‌కు సైనిక సహాయం కొనసాగించేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించింది.
ముఖ్యంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కలిసి సాగాలని బలంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌదం పేర్కొంది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలతోపాటు పెట్టుబడులకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరగనున్నట్లు వెల్లడించింది.
ఉగ్రవాదాన్ని పెకలించేస్తా: ట్రంప్
Published Tue, Mar 21 2017 12:07 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement