డీవైఎఫ్ఐ జిల్లా కార్యవర్గం
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్ల నాగరాజు, జి.తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.భీమాసాహెబ్ తెలిపారు. మంగళవారం నగరంలో డీవైఎఫ్ఐ 4వ జిల్లా మహాసభలలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జి.టి నాయక్, జి.శివరాజు, దిలీప్, సహాయ కార్యదర్శులుగా భాస్కర్‌నాయక్, భానేష్, రాము, కమిటీ సభ్యులుగా రాజు, సూర్య, చిరంజీవి, ప్రేమ్‌కుమార్, కాసీమ్, సంతోష్, శ్రీకాంత్ ఎన్నికయ్యారు.