Distribution of those tracks
-
పాత ‘పట్టా’లకు ‘డబుల్’ ధమాకా!
హెచ్ఎండీఏ పరిధిలో ఇళ్ల పట్టాల జారీపై,నిషేధం సడలింపు! నాటి లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్లు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గూడులేని పేదలకు శుభవార్త. జిల్లా ప్రజలకు శాపంగా పరిణమించిన ఇళ్ల పట్టాల పంపిణీపై విధించిన నిషేధాన్ని సడలించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, ఇళ్ల స్థలాల స్థానే రెండు పడకల గదుల గృహాలను ‘పట్టా’దారులకు అందజేయాలని ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీపై 2006లో అప్పటి సర్కారు నిషేధం విధించింది. ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరగకపోవడం, కనీస వసతులు లేక మురికివాడలుగా మారుతుండడం, పట్టాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతంతో పట్టాల జారీని నిలిపివేస్తూ ఉత్తర్వులు (జీఓ 493) ఇచ్చింది. రింగ్‌రోడ్డు అవతల ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్లను అభివృద్ధి చేసి కాలనీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే క్రమంలో పట్టాలు కలిగి ఉన్నా.. ఇళ్లులేని పేదలందరికీ రాజీవ్ గృహాకల్ప, ఇందిరమ్మ పథకం కింద నివాసయోగ్యం కల్పించాలని నిర్దేశించింది. అప్పటికే చాలామందికి ఇళ్ల పట్టాలు ఉండడం.. కొందరికి ఇంకా పొజిషన్ ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే 2008లో నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగం కొత్తగా మరో 10వేల మందికి పట్టాలను జారీ చేసింది. కిరణ్ నిర్ణయంతో గ ందరగోళం.. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం జరిగిన పరిణామాలు పేదలను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. ఇళ్ల పట్టాలు అందాయని సంతోషం ఆవిరయ్యేలా అప్పటి ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి ఇళ్ల పట్టాలపై మరోసారి నిషేధం ప్రకటించారు. అయితే, ఈ సారి ఏకంగా పరిధిని కూడా విస్తరించారు. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే 18 మండలాల్లో ఇళ్ల పట్టాలను ఇవ్వకూడదని ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాదాపు 19వేల మంది పేదలు పట్టాలు కలిగియున్నప్పటికీ పనికిరాకుండా పోయాయి. దీంతో ఈ నిషేధం ఎత్తివేయాలని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం... నిషేధం సడలించడమే కాకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్రాంతాలను కాలనీలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగంగా గతంలో పట్టాలున్నవారికీ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అంతేగాకుండా గతంలో ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకొని 120 గజాల విస్తీర్ణంలో రెండు పడకల గదుల గృహాలను నిర్మించి ఇచ్చేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రఘునందన్‌రావును ఆదేశించారు. అలాగే గతంలో పేదల ఇళ్లకు నిర్ధేశించిన పదెకరాలను లేఅవుట్లుగా అభివృద్ధి చేసి ఆదర్శకాలనీలుగా మార్చాలని సూచించారు. తాజాగా పెలైట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. -
2 నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ
ఆరుగురు మహిళలకు లాంఛనంగా పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ ప్రక్రియకు జూలైదాకా గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఇళ్ల పట్టాల పంపిణీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆవిర్భావ దినోత్సవ వేదికపై వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ స్థలాల్లో నివాసమేర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గత డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాల కోసం వేచి చూస్తున్న సుమారు 1.30 లక్షలమంది అర్హులైన పేదలకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా పట్టాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూలై వరకు గడువు పెంపు: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 58, 59) మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఏప్రిల్ నెలాఖరుతో గడువు ముగిసింది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియ గడువును జూలై నెలాఖరు వరకు పొడిగించిందని అధికారులు తెలిపారు. వాస్తవానికి క్రమబద్ధీకరణ కోసమని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,66,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 3,36,869 మంది జీవో 58 ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, 29,281 వేలమంది జీవో 59 మేరకు చెల్లింపు కేటగిరీ కింద దరఖాస్తులు సమర్పించారు. అయితే.. ఉచిత కేటగిరీ కింద అందిన దరఖాస్తుల్లో కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలిటరీ.. తదితర సంస్థల భూములకు చెందిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు లక్షకు పైగా ఉన్నట్లు తేలింది. పురుషుల పేరిటా పట్టాలు క్రమబద్ధీకరణ ప్రక్రియ కింద ఇచ్చే ఇళ్ల పట్టాలను ఆయా కుటుంబాల్లోని మహిళల పేరిటే ఇవ్వాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న సుమారు 20 వేల కుటుంబాల్లో మహిళలు లే రని తేలింది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మహిళలు లేని కుటుంబాల్లో పురుషుల పేరిట పట్టాలు ఇవ్వాలని అధికారులను సర్కారు ఆదేశించిం ది. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని అభ్యంతరకర భూముల క్రమబద్ధీకరణ విషయమై ఆయా విభాగాలతో చర్చించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. అలాగే.. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల పరిశీలన కూడా గడువులోగా పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జూలై నెలాఖరులోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కాకుంటే క్రమబద్దీకరణ ప్రక్రియ గడువును మరోమారు పొడిగించే అవకాశం లేకపోలేదని రెవెన్యూ శాఖలోని ఓ కీలక అధికారి తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా.. అందిన దరఖాస్తులు 3,66,150 ఉచిత కేటగిరీకి చెందినవి 3,36,869 చెల్లింపు కేటగిరీలో వచ్చినవి 29,281 కేంద్రానికి చెందిన భూములు 1,03,331 పట్టాలకు ఎంపికైన దరఖాస్తులు 1,32,819 సిద్ధంగా ఉన్న పట్టాలు 1,30,000