distribyutari
-
చివరి ఆయకట్టునూ రక్షిస్తాం
⇒ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు ⇒ జిల్లాలో రూ. వెయ్యి కోట్ల సాగు ⇒ నీటిని సద్వినియోగం చేసుకోవాలి ⇒ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల ⇒ డిస్ట్రిబ్యూటరీల వద్ద వీఆర్వో, వీఆర్ఏలను కాపలా ఉంచాలి ⇒ వాహనంలో పర్యవేక్షిస్తా ⇒ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ‘జిల్లాలో దాదాపు రూ. వెయ్యి కోట్ల వరి పంట ఉంది.. ఇది ఆషామాషీ విషయం కాదు.. పంట వేసిన రైతుకు జీవన్మరణ సమస్య... అధికారులు సమష్టి బాధ్యత తీసుకుని చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. వేసిన పంటలను కాపాడాలి’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో నీటి పారుదల అధికారులు, తహసీల్దార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద 2 లక్షల 10 వేల ఎకరాల పంట సాగవుతోందన్నారు. ప్రస్తుతం మూడు విడతలుగా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయగా, ఇంకా మూడు విడతల నీటిని ప్రాజెక్టుల నుంచి ఆన్అఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో రబీ పంటలకు విడుదల చేసే నీటిని సక్రమంగా వాడుకోకపోతే నీరంతా వృథా అవుతుందన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద 82 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు కలిపి 766 డిస్ట్రిబ్యూటరీలు, 218 సబ్ డిస్ట్రి బ్యూటరీలు ఉన్నాయన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద ఒక వీఆర్వో, ప్రతి సబ్ డిస్ట్రిబూట్యరీ వద్ద వీఆర్ఏలను కాపాల ఉంచాలన్నారు. వీరికి షిప్టుల వారిగా డే అండ్ నైట్ డ్యూటీలు వేసే బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. ఎవరెవరు డిస్ట్రిబ్యూటరీల వద్ద ఉంటున్నారో వారి పేర్లతో సహా వివరాలు అందించాలని, తాను పది రోజుల పాటు కెనాల్‌పైనే వాహనంలో పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. మూడు విడతల నీటిలో 850–1000 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయడకుండా అవగాహన కల్పిం చాలని అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీరు నిలువ ఉండగా, అందులోంచి 2.9 టీఎంసీల నీటిని వినియోగించగా, ఇంకా 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. కాలువను బంద్ చేసే సమయంలో ఇరిగేషన్ అధికారులు చివరి ఆయకట్టు వరకు నీరు అందిందో లేదో తెలుసుకున్న తరువాతే బంద్ చేయాలన్నారు. లేదంటే చివరి ఆయకట్టు పంట లకు నష్టం జరుగుతుందన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు యోగితా రాణా, సత్య నారాయణ, జేసీ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దండు కదిలింది !
- ప్రధాన కాల్వ అడ్డుకట్ట తొలగించిన 400 మంది రైతులు - అన్నదాతలకు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి సంఘీభావం జన్నారం : కడెం ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువ ద్వారా 28 డిస్ట్రిబ్యూటరీ వరకు నీరు అందడం లేదని, దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ దండేపల్లి మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం జన్నారం మండలం కామన్పల్లి ప్రాంతంలో 13 డిస్ట్రిబ్యూటరీకి వెళ్లేతూము వద్ద ఆ ప్రాంత రైతులు బండరాళ్లతో అడ్డుకట్ట వేశారు. దీంతో తమకు నీరు రావడం లేదని ఆగ్రహించిన దండేపల్లికి చెందిన 400 మంది రైతులు దండులా కదిలివచ్చారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అధ్వర్యంలో అడ్డుకట్టను తొలగించారు. కడెం ఆయక ట్టులో నీరున్న తగినంత విడుదల కాకుండా వారబందీ ద్వారా కేవలం 4 ఫీట్లు విడుదల చేయడం వల్లే నీళ్లు జన్నారం మండల వరకైనా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దండేపల్లి మండలం అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి , తాళ్లపేట్ సర్పంచ్ లింగరావు, గూడెం ఎంపీటీసీ సభ్యులు ముత్తే నారాయణ పాల్గొన్నారు. మేదరిపేటలో సాగునీటి కోసం రాస్తారోకో దండేపల్లి : కడెం ఆయకట్టు కింద ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి డిమాండ్ చేశారు. కడెం ఆయకట్టు కింద పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని, నీటి గేజ్‌ను పెంచాలని మండల రైతులు గురువారం కడెం ప్రాజెక్టుకు తరలి వెళ్లారు. దారిలో మండలంలోని మేదరిపేట వద్ద రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. కడెం ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళన కడెం: కడెం ప్రాజెక్టు ద్వారా తమ పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి,తాళ్లపేట,లక్సెట్టిపేట, తపాలాపూర్,రోటిగూడెం ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ఇక్కడికి తరలివచ్చారు. సాగు నీరులేక తమ పంటలు ఎండిపోతున్నాయని వారు అధికార్లతో చెప్పారు. అయితే రైతులు వచ్చారనే సమాచారంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైతులతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రైతుల తరఫున ఆయన ప్రాజెక్టు డీఈతో మాట్లాడి ఆయకట్టు పరిస్థితిని వివరించారు.గతంలో కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం ఆయకట్టు కిందనున్న డీ-28 వరకు నీటిని విడుదల చేయాలన్నారు.నీరివ్వకుంటే ఊర్కోమని,నీరిచ్చేదాకా ఇక్కడే ఉంటామని రైతులు భీష్మించారు. దీంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ ఇక్కడి పరిస్థితిని ఈఈ వెంకటేశ్వర్‌కు వివరించారు. నీటి విడుదలపై రెండు రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామని వారు రైతులకు హామీ ఇచ్చారు.దీంతో స్పందించిన రైతులు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని అధికారులకు సూచించి నిరసన విరమించారు. 400 మంది రైతులు నిరసనలో పాల్గొన్నారు. 28వ డిస్ట్రిబ్యూటరీ దాకా నీళ్లిస్తాం దండేపల్లి : కడెం ప్రాజెక్టు నీటిని 28వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ వరకూ నీటిని అందిస్తామని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు కింద నెలకొన్న సాగు నీటి ఇబ్బందులను నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రధాన కాల్వలకు నీటి గేజిని సుమారు 7 ఫీట్లకు పైగా పెంచి విడుదల చేస్తామన్నారు. కాల్వలో నీటికి అడ్డుకట్టలు వేయకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. గూడెం ఎత్తిపోతల నీటిని శుక్రవారం నుంచి రెండు మోట్లార్ల ద్వారా విడుదల చేస్తామన్నారు.