the district
-
నలుగురు ఎస్సైలకు పదోన్నతి
నిజామాబాద్ క్రైం: జిల్లాలో సీనియర్ ఎస్సైలు నలుగురికి సీఐలుగా పదోన్నతులు రానున్నాయి. టూటౌన్ ఎస్సై బోస్ కిరణ్, 5వ టౌన్ ఎస్సై సైదయ్య, వీఆర్‌లో ఉన్న ముజుబుర్ ఉర్ రహమాన్, ప్రతాప్‌లింగంలకు పదోన్నతి రానుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సమాచారం. వాస్తవానికి నెల క్రితమే వెలువడాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈలోగా గణేశ్ ఉత్సవాలు రావటంతో నిలిచిపోయిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో వెలువడనున్నట్లు తెలిసింది. నిలిచిపోయిన ఎస్సైల బదిలీలు.. మరోవైపు, జిల్లాలో ఎస్సైల బదిలీలు నిలిచిపోయాయి. నెల క్రితం ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఏకంగా 11 మందిని వీఆర్‌కి బదిలీ చేయడం అప్పట్లో కలకలం రేపింది. అయితే, సదరు ఎస్సైలు ప్రజాప్రతినిధులను కలిసి బదిలీలను నిలిపి వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఆగ్రహంతో ఇన్చార్జి డీఐజీ ఇటీవల బోధన్‌లో పర్యటించిన సమయంలో.. ఆరోపణలు వచ్చిన నలుగురు ఎస్సైలపై చర్యలకు ఉపక్రమించారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిబ్బంది విభజన పూర్తయ్యాకే ఎస్సైల బదిలీలు ఉంటాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు
దేవరకొండ దేవరకొండలో ఈ నెల 27న ప్రారంభమైన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి యూసూఫ్, షరీఫ్, శ్యామ్సన్లు గెలుపొందగా, రెండవ బహుమతి ఇలియాస్, ముజీబ్‌లు కైవసం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షటిల్ ఇండోర్ స్టేడియానికి స్థలాన్ని కేటాయించేందుకు కషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కష్ణకిషోర్, తాళ్ళ సురేష్, చంద్రయ్య, భాస్కర్, బాబా, కష్ణమూర్తి, నర్సింహ్మ, ఐజాక్, రమేష్, వరికుప్పల సురేష్, శేఖర్, గిరి ఉన్నారు. -
జిల్లాకు చేరిన యూరియా
1518 టన్నులు సరఫరా ప్రొద్దుటూరు: జిల్లాకు కొంతమేరకు యూరియా కొరత తీరినట్టే. యూరియా సరఫరా కావడంతో రైతుల ఇబ్బందులు తీరుతాయి. ముఖ్యంగా కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగా వరి పంటను సాగు చేస్తున్నారు. దీంతో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇతర పంటల సాగుకు యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా యూరియా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లోని రైతులు యూరియా కోసం కర్నూలు జిల్లాకు సైతం వెళ్లారు. ఈ సమస్యపై ‘యూరియా లేదయా’ అనే శీర్షికతో ఈనెల 1న సాక్షిలో ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఆదివారం జిల్లాకు యూరియాను తెప్పించారు. కాకినాడ నుంచి వ్యాగన్లోడ్ నాగార్జున నీమ్కోటెడ్ యూరియా కడపకు వచ్చింది. మొత్తం 1518 టన్నుల యూరియా రాగా రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయాధికారులు జిల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు ఆదివారమే తరలించారు. ఇందులో 400 టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేశారు. కాగా యూరియా ధర విషయంలో కూడా వివాదం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించాలని వ్యవసాయాధికారులు, తమకు గిట్టుబాటు కాదని ఇటు వ్యాపారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుకాణాలకు ఆదివారం సాయంత్రానికే యూరియా చేరింది. యూరియా బస్తా ధర ఏవిధంగా అమ్ముతారనే విషయం చర్చాంశనీయంగా మారింది.