District central government hospital
-
ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఆధిపత్య పోరు..!
రెండు వర్గాలుగా విడిపోయిన వైద్యులు ⇒ ‘నవజాత’లో ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు ⇒ చిన్నారుల వైద్యసేవలకు విఘాతం ⇒ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న సూపరింటెండెంట్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధిపత్య పోరు తార స్థాయికి చేరింది. రెండు వర్గాలుగా విడిపోయిన వైద్యులు ఓ వర్గంపై మరో వర్గం వారు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అందుతున్న సేవలకు ప్రభుత్వం వైద్యులకు, సిబ్బందికి ఇస్తున్న ప్రోత్సాహక నిధులే డాక్టర్ల మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది. నల్లగొండటౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో ఐదేళ్ల క్రితం నవజాత శిశుసంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈ కేంద్రం గుర్తింపు తెచ్చుకుంది. 28 వారాలకే కేవలం 650 గ్రాముల బరువుతోనే తల్లి గర్భం నుంచి భూమ్మీదకొచ్చిన ‘బాహుతల్లి’కి ఈ కేంద్రంలోనే చికిత్స చేశారు.155 రోజుల పాటు ఆ శిశువుకు సేవలందించి బతికించిన ఘనకీర్తి ఈ నవజాత శిశు సంరక్షణ కేంద్రం సొంతం. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడే ఈ కేంద్రంలో ఆరోగ్య శ్రీ కింద చిన్నారులకు అందుతున్న వైద్య సేవలే డాక్టర్ల మధ్య పొరపొచ్చాలకు కారణమయ్యాయి. ఆరోగ్య శ్రీ నిధుల కిరికిరి నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో నిత్యం వందల మంది చిన్నారులకు సేవలందిస్తుంటారు. అవసరం ఉన్న శిశువులకు ఆరోగ్య శ్రీ పథకం కింద కూడా చికిత్స నిర్వహిస్తారు. అయితే, ఈ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులే ప్రస్తుతం వైద్యుల కిరికిరికి ప్రధాన కారణం. ఆరోగ్య శ్రీ పథకం కింద ఓ చిన్నారికి రూ. లక్ష వరకు వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం వైద్యులకు 20 శాతం, కేంద్రం మొత్తం సిబ్బందికి మరో 15 శాతం నిధులను పోత్సాహకంగా అందజేస్తుంది. దీంతో ఈ కేంద్రం నిర్వాహకులు అవసరం ఉన్నా లేకున్నా ఆరోగ్యశ్రీ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నారని ఆస్పత్రి ఉన్నత స్థాయి వైద్యుల ప్రధాన ఆరోపణ. అయితే నిబంధనల మేరకు చికిత్స అందజేస్తున్నామని ఆ కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. వివిధ రకాల జబ్బులతో బాధపడే చిన్నారులను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే ఆరోగ్య శ్రీ పథకానికి ఆమోదించాలని పంపుతున్నామని, ఇందులో దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారమే లేదనేది వారి వాదన. చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళన అయితే. డాక్టర్ల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చిన్నారులకు అందే చికిత్సకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుండడంతో చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలుగుతున్న తరుణంలో వైద్యులు వృత్తిధర్మాన్ని విస్మరిస్తూ పోరుకు సై అంటుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తేనే వైద్యుల మధ్య నెలకొన్న వివాదానికి తెరపడి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులకు నివేదిస్తా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహిస్తున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రంపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. ఈ కేంద్రం ద్వార ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తోన్న సేవలు వివాదాలకు కారణమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తా. – నర్సింగరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
వైద్యుల పనితీరుపై నిఘా
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల పనితీరుపై నిఘా పెరిగింది. విధులకు గైర్హాజరు, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు. ప్రధానంగా నాలుగు రోజుల క్రితం జిల్లా లో ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు నిరసన చేపట్టిన సమయంలో వారికి మ ద్దతుగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించడంపై కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వైద్య సహాయం అందక విలవిలలాడి పోయారు. మరుసటి రోజు పత్రికల్లో వార్తలు రాగా కలెక్టర్ వెంటనే జిల్లా ఆరోగ్యశాఖాధికారి గోవింద్ వాగ్మరే, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్లను పిలిపించారు. గాడి తప్పిన ఆస్పత్రి తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల విధి నిర్వహణపై పూర్తి పరిశీలిన చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి ఎంతమంది వైద్యులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరు సక్రమంగా విధులకు హాజరవుతున్నారా లేదా అన్న విషయాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ కళాశాల తరపున కేటాయించబడిన వైద్యులపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. వీరు విధులకు హాజరు కానప్పటికీ రిజిస్టర్లో సంతకాలు చేస్తూ వేతనాలు తీసుకుంటున్నట్లు అధికారుల దృష్టిలో ఉంది. ఇలాంటి వైద్యులను డీఎంఈకి సరెండర్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్ సమావేశం నిర్వహించగా వైద్యులు తిరగబడ్డారు. మాపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తారా.. మా రిజిష్టర్లు కలెక్టర్‌కు చూపిస్తారా అంటూ పరిపాలన అధికారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ‘ మా విధులకు కలెక్టర్‌కు ఏమిటి సంబంధం?’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మే మంతా మెడికల్ కళాశాల పరిధిలో ఉన్నాము. మేము ఎవరి మాటా వినదల్చుకోలేదు’ అంటూ వైద్యులు చిందులేశారు. దీంతో చేసేదీఏమీ లేక వైద్యాధికారులు బిత్తరపోయారు. గైర్హాజరు వేసినందుకు ఓ వైద్యుడు వైద్యాధికారులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్ జోక్యం చేసుకుని వైద్యులను హెచ్చరించినట్లు సమాచారం. ‘వైద్యాధికారులంటే తమాషాగా ఉందా, అధికారులు చెబితే ఎందుకు వినడం లేదంటూ’ మండిపడినట్లు తెలిసింది. సక్రమంగా విధులు నిర్వహించకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని, పనితీరుపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. ఇకనైనా విధుల్లో నిర్లక్ష్యాన్ని వీడాలని, లేకపోతే, చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు హెచ్చరించారు. సమావేశం ఆద్యంతం వాగ్వాదాలతోనే ముగిసింది. -
‘మార్పు’ ఎక్కడ!
నిజామాబాద్ అర్బన్ ,న్యూస్‌లైన్: ల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు నరకం చూస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం అనితకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సాయంత్రం ఐదు గం టలకు అనిత భర్త రాజేశ్ కలెక్టర్‌ను కలిసి పరిస్థితి వివరించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఫోన్‌చేసి తక్షణమే వైద్యసహాయం అందించాలని కోరారు. అయినా మహిళా వైద్యులు లేరంటూ వైద్యాధికారులు అనితను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఒక్క గైనాకాలజిస్టు సెలవుల్లో వెళ్లడంతో ఈ పరిస్థితి దాపురిచిం చింది. మొఖంచాటేసిన వైద్యులు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఎనిమిదంతస్తుల నూతన భవనాలు ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో వైద్యులను కూడా కేటాయించారు. కళా శాలకు అనుబంధం ఉండడంతో 121 మంది వివిధ విభాగాల ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులయ్యారు. ఎనిమిది మంది గైనాకాలజిస్టులు ఇం దులో ఉన్నారు. వీరు ఆసుపత్రికి వైద్యసేవలు అందించాల్సి ఉంది. కానీ గత ఏడాదిగా వీరంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. రిజిష్టర్‌లో సంతకాలు చేస్తు వేత నాలు తీసుకుంటూ ఆసుపత్రికి మాత్రం మొఖం చాటేశారు. ప్రస్తుతం ఆసుపత్రికి 11 మంది ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే అందుబాటు లో ఉన్నారు. ఎనిమిదిమంది గైనాకాలజిస్టుల్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు.వీరు గత ఆరు రోజులుగా సెలవులో ఉన్నారు. మిగితా ఆరుగురు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసేందుకు నిరాకరించి హైదరాబాద్‌కే వెళ్లిపోయారు. దీంతో ఆసుపత్రిలో స్త్రీ వైద్యనిపుణురాళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితం లేని మార్పు జిల్లాలో ‘మార్పు’ పథకం ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రతి గర్భిణీ సర్కారు ఆస్పత్రిలోనే ప్రసవించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకం చివరకు వారి పాలిట శాపంగా మారింది. ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకవస్తున్నారు. తీరా అక్కడ సౌకర్యాలు, వైద్యులు లేక వారు నరకం అ నుభవిస్తున్నారు. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రులు ఉండగా, 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 3 ఏరియా ఆసుపత్రుల్లో మార్పు కింద ప్రసవాలు చేసేందుకు నిర్ణయించారు. కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కడ కూడా ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేవు. ఉన్నా సౌకర్యాలు లేవు. ముఖ్యం గా 29 ఆరోగ్య కేంద్రాలకు కేవలం అందుబాటులో ముగ్గురు మహిళా వైద్యనిపుణులు మాత్రమే ఉన్నారు. మూడు ఏరియా ఆసుపత్రులకు సంబంధించి కేవలం ముగ్గు రు మాత్ర మే స్త్రీ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు 15 నుంచి 20 ప్రసవాల కేసులు నమోదు అవుతుంటాయి. వైద్యులు అందుబా టులో లేక పోవడంతో ప్రసవానికి వచ్చేవారు , ఆసుపత్రులో చికిత్స పొందుతున్న బాలింతలు వైద్యులు లేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.