నిజామాబాద్ అర్బన్ ,న్యూస్‌లైన్: ల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు నరకం చూస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం అనితకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సాయంత్రం ఐదు గం టలకు అనిత భర్త రాజేశ్ కలెక్టర్‌ను కలిసి పరిస్థితి వివరించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఫోన్‌చేసి తక్షణమే వైద్యసహాయం అందించాలని కోరారు. అయినా మహిళా వైద్యులు లేరంటూ వైద్యాధికారులు అనితను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఒక్క గైనాకాలజిస్టు సెలవుల్లో వెళ్లడంతో ఈ పరిస్థితి దాపురిచిం చింది.
మొఖంచాటేసిన వైద్యులు
జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఎనిమిదంతస్తుల నూతన భవనాలు ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో వైద్యులను కూడా కేటాయించారు. కళా శాలకు అనుబంధం ఉండడంతో 121 మంది వివిధ విభాగాల ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులయ్యారు. ఎనిమిది మంది గైనాకాలజిస్టులు ఇం దులో ఉన్నారు. వీరు ఆసుపత్రికి వైద్యసేవలు అందించాల్సి ఉంది. కానీ గత ఏడాదిగా వీరంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
రిజిష్టర్‌లో సంతకాలు చేస్తు వేత నాలు తీసుకుంటూ ఆసుపత్రికి మాత్రం మొఖం చాటేశారు. ప్రస్తుతం ఆసుపత్రికి 11 మంది ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే అందుబాటు లో ఉన్నారు. ఎనిమిదిమంది గైనాకాలజిస్టుల్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు.వీరు గత ఆరు రోజులుగా సెలవులో ఉన్నారు. మిగితా ఆరుగురు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసేందుకు నిరాకరించి హైదరాబాద్‌కే వెళ్లిపోయారు. దీంతో ఆసుపత్రిలో స్త్రీ వైద్యనిపుణురాళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది.
ఫలితం లేని మార్పు
జిల్లాలో ‘మార్పు’ పథకం ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రతి గర్భిణీ సర్కారు ఆస్పత్రిలోనే ప్రసవించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకం చివరకు వారి పాలిట శాపంగా మారింది. ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకవస్తున్నారు. తీరా అక్కడ సౌకర్యాలు, వైద్యులు లేక వారు నరకం అ నుభవిస్తున్నారు. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రులు ఉండగా, 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 3 ఏరియా ఆసుపత్రుల్లో మార్పు కింద ప్రసవాలు చేసేందుకు నిర్ణయించారు. కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కడ కూడా ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేవు.
ఉన్నా సౌకర్యాలు లేవు. ముఖ్యం గా 29 ఆరోగ్య కేంద్రాలకు కేవలం అందుబాటులో ముగ్గురు మహిళా వైద్యనిపుణులు మాత్రమే ఉన్నారు. మూడు ఏరియా ఆసుపత్రులకు సంబంధించి కేవలం ముగ్గు రు మాత్ర మే స్త్రీ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు 15 నుంచి 20 ప్రసవాల కేసులు నమోదు అవుతుంటాయి. వైద్యులు అందుబా టులో లేక పోవడంతో ప్రసవానికి వచ్చేవారు , ఆసుపత్రులో చికిత్స పొందుతున్న బాలింతలు వైద్యులు లేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.
‘మార్పు’ ఎక్కడ!
Published Wed, Mar 19 2014 3:09 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement