District Cricket Association
-
వారు ఆడిందే ఆట
♦ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో నాటౌట్ బ్యాట్స్మెన్లు ♦ ఏళ్లుగా ఒకే పదవిలో కొనసాగుతున్న పెద్దలు ♦ లోథా కమిటీ సిఫార్సులూ బుట్టదాఖలు ♦ ఇష్టారాజ్యంగా ఏసీఏ నిధుల వినియోగం ♦ ఏకపక్ష సెలక్షన్స్‌తో నష్టపోతున్న ప్రతిభావంతులు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో కొందరు పెద్దలు ఏళ్లుగా తిష్టవేశారు. ఆంధ్ర క్రికెట్ (ఏసీఏ) నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ప్రతిభను పక్కనపెట్టి తమకు అనుకూలమైన వారినే సెలక్షన్ చేస్తుండడంతో ప్రతిభావంతులు అవకాశాలు కోల్పోతున్నారు. జనవరి 1 నుంచి లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వారు మాత్రం తామెప్పటికీ నాటౌట్ బ్యాట్స్మెన్లమే నంటూ గ్రౌండ్ వీడడం లేదు. – అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రికెట్... మనదేశంలో ఈ క్రీడ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రంజీకి సెలక్టయినా అటు డబ్బు..ఇటు పేరు వస్తుంది. అందుకే క్రీడాకారులంతా క్రికెట్‌ను ఎంచుకుని తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. క్రికెట్‌కు ఉన్న ఈ క్రేజ్ చూసే క్రీడా సంఘాలూ పుట్టుకువచ్చాయి. ఇపుడు అవే పెత్తనం చేస్తున్నాయి. తాము ఆడిందే ఆటగా నడుచుకుంటున్నాయి. క్రీనీడకు ‘లోథా’ బ్రేక్ ఐపీఎల్ సందర్భంగా తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు దేశంలో ఏర్పాటు చేయబడిన కమిటీ లోథాకమిటీ క్రికెట్ అసోసియేషన్లకు సంబంధించి పలు సూచనలు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లోథా కమిటీ సిఫారసులు అమలు చేయాలని తీర్పు చెప్పింది. లోథా కమిటీ ఏం చెప్పిందంటే ♦ ఒక వ్యక్తి రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష, కార్యదర్శి పదవిని చేపట్టడానికి వీల్లేదు. ♦ ఏ పదవిలో అయినా ఆరేళ్ల మించి ఉండకూడదు. ♦ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు అనుబంధంగా పనిచేస్తున్న అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(ఏడీసీఏ) దీన్ని లోథా కమిటీ సిఫారసులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ప్రస్తుతం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాంచో ఫెర్రర్ 2004 నుంచి 12 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు. ఆయనతోపాటు కార్యదర్శి పదవి కూడా ఇదే తీరుగా సాగుతుండగా ఈ ఏడాది మేలో నూతన కార్యదర్శిగా కేఎస్ షాహబుద్దీన్‌ను ఎంపిక చేశారు. దీంతోపాటు ఈ సంఘంలోని ఇతర సభ్యులు ఏళ్ల తరబడి అదే కేడెర్లో ఉంటూ తమ ఆధిపత్యాన్ని సాగిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవుతున్నారనే ఆరోపణలున్నా యి. ఏడీసీఏలో చాలా మంది ఏళ్లుగా పాతుకుపోవడాన్ని జిల్లాలోని పలువురు సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకు ప్రాతినిథ్యం వహించి... జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడిన చాలామంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారనీ, వారిని కాదని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి ఆధిపత్యం చలాయించడం పట్ల వారు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా క్రికెట్ సంఘాన్ని ప్రక్షాళన చేసి... కొత్తవారిని తీసుకుంటే క్రికెటర్లకు మేలు జరుగుతుందని పలువురు సీనియర్ క్రికెట్ క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. స్టేడియం మంజూరైనా... ధర్మవరం ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పదేళ్ల క్రితం నివేదిక అందించారు. దీనికి అప్పట్లో జిల్లా కలెక్టర్ స్థలాన్ని కూడా పరిశీలించారు. అన్ని తతంగాలు పూర్తయిన తర్వాత ఫైలు ఏసీఏకు చేరింది. అయితే జిల్లా క్రికెట్ సంఘం నుంచే ఫైలును పంపించాలని ఏసీఏ తనకు అందిన ఫైలును వెనక్కు పంపింది. కానీ జిల్లా క్రికెట్ సంఘం ధర్మవరం స్టేడియం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు పెద్దలు కావాలనే స్టేడియం నిర్మాణానికి అడ్డుపడ్డారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. అంతా ఆర్డీటీ కనుసన్నల్లోనే... జిల్లాలో క్రికెట్‌కు సంబంధించిన ప్రతి అంశం ఆర్డీటీ సంస్థ కనుసన్నల్లో సాగుతోంది. ఏడీసీఏ కార్యాలయాన్ని ఆర్డీటీ ప్రధాన క్రీడా మైదానంలోనే ఏర్పాటు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆరుగురు కోచ్‌లు, ఫిట్నెస్ ట్రైనర్ కూడా ఆర్డీటీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ఆర్డీటీ సంస్థ సొంతంగా మరో 23 మందిని నియామకం చేసుకుంది. జిల్లాలో ఎలాంటి సెలెక్షన్ నిర్వహించాలన్నా... క్రికెట్ సమావేశం నిర్వహించాలన్నా.... ఆర్డీటీ ఆధ్వర్యంలో సాగుతుంది. ఏసీఏ అందించిన సామగ్రిని సైతం ఆర్డీటీ క్రీడా మైదానంలో వినియోగించుకుంటున్నారని సీనియర్ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. -
వారు ఆడిందే ‘ఆట’
జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో నాటౌట్ బ్యాట్స్మెన్లు ఏళ్లుగా ఒకే పదవిలో కొనసాగుతున్న పెద్దలు లోథా కమిటీ సిఫారసులూ బుట్టదాఖలు ఇష్టారాజ్యంగా ఏసీఏ నిధుల వినియోగం ఏకపక్ష సెలక్షన్స్‌తో నష్టపోతున్న ప్రతిభావంతులు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను కొందరు పెద్దలు ఏళ్లుగా తిష్టవేశారు. ఆంధ్ర క్రికెట్ (ఏసీఏ) నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ప్రతిభను పక్కనపెట్టి తమకు అనుకూలమైన వారినే సెలక్షన్ చేస్తుండడంతో ప్రతిభావంతులు నష్టపోతున్నారు. జనవరి 1 నుంచి లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చినా వారు మాత్రం తామెప్పటికీ నాటౌట్ బ్యాట్స్మెన్లమే నంటూ గ్రౌండ్ వీడడం లేదు. - అనంతపురం సప్తగిరి సర్కిల్: క్రికెట్... మనదేశంలో ఈ క్రీడ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రంజీకి సెలక్టయినా అటు డబ్బు..ఇటు పేరు వస్తుంది. అందుకే క్రీడాకారులంతా క్రికెట్‌ను ఎంచుకుని తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. క్రికెట్‌కు ఉన్న ఈ క్రేజ్ చూసే క్రీడా సంఘాలూ పుట్టుకువచ్చాయి. ఇపుడు అవే పెత్తనం చేస్తున్నాయి. తాము ఆడిందే ఆటగా నడుచుకుంటున్నాయి. క్రీనీడకు లోథా బ్రేక్ ఐపీఎల్ సందర్భంగా తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు దేశంలో ఏర్పాటు చేయబడిన కమిటీ లోథాకమిటీ క్రికెట్ అసోసియేషన్లకు సంబంధించి పలు సూచనలు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లోథా కమిటీ సిఫారసులు అమలు చేయాలని తీర్పు చెప్పింది. లోథా కమిటీ ఏం చెప్పిందంటే -ఒక వ్యక్తి రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష, కార్యదర్శి పదవిని చేపట్టడానికి వీల్లేదు. - ఏ పదవిలో అయినా ఆరేళ్ల మించి ఉండకూడదు. - క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు అనుబంధంగా పనిచేస్తున్న అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(ఏడీసీఏ) దీన్ని లోథా కమిటీ సిఫారసులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ప్రస్తుతం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాంచో ఫెర్రర్ 2004 నుంచి 12 ఏళ్లుగా ఆ పదిలో ఉన్నారు. ఆయనతోపాటు కార్యదర్శి పదవి కూడా ఇదే తీరుగా సాగుతుండగా ఈ ఏడాది మేలో నూతన కార్యదర్శిగా కేఎస్ షాహబుద్దీన్‌ను ఎంపిక చేశారు. దీంతోపాటు ఈ సంఘంలోని ఇతర సభ్యులు ఏళ్ల తరబడి అదే కేడెర్లో ఉంటూ తమ ఆధిపత్యాన్ని సాగిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏడీసీఏలో చాలా మంది ఏళ్లుగా పాతుకుపోవడాన్ని జిల్లాలోని పలువురు సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకు ప్రాతినిథ్యం వహించి... జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడిన చాలామంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారనీ, వారిని కాదని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి ఆధిపత్యం చలాయించడం పట్ల వారు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా క్రికెట్ సంఘాన్ని ప్రక్షాళన చేసి... కొత్తవారిని తీసుకుంటే క్రికెటర్లకు మేలు జరుగుతుందని పలువురు సీనియర్ క్రికెట్ క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. అంతా ఆర్డీటీ కనుసన్నల్లోనే... జిల్లాలో క్రికెట్‌కు సంబంధించిన ప్రతి అంశం ఆర్డీటీ సంస్థ కనుసన్నల్లో సాగుతోంది. ఏడీసీఏ కార్యాలయాన్ని ఆర్డీటీ ప్రధాన క్రీడా మైదానంలోనే ఏర్పాటు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆరుగురు కోచ్‌లు, ఒక ఫిట్నెస్ ట్రైనర్‌కు ఏసీఏ జీతాలను అందించినా... వారు మాత్రం ఆర్డీటీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ఆర్డీటీ సంస్థ తన సొంత నిధులను వెచ్చించి మరో 23 మందిని నియామకం చేసుకుని జీతాలు చెల్లిస్తోంది. జిల్లాలో ఎలాంటి సెలెక్షన్ నిర్వహించాలన్నా... క్రికెట్ సమావేశం నిర్వహించాలన్నా.... ఆర్డీటీ ఆధ్వర్యంలో సాగుతుంది. వారి ప్రమేయం లేకుండా ఎలాంటి చర్యలు జిల్లాలో తీసుకోలేని పరిస్థితి తలెత్తింది. ఏసీఏ అందించిన సామగ్రిని సైతం ఆర్డీటీ క్రీడా మైదానంలో వినియోగించుకుంటున్నారని సీనియర్ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. స్టేడియం మంజురైనా... ధర్మవరం ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పదేళ్ల క్రితం నివేదిక అందించారు. దీనికి అప్పట్లో జిల్లా కలెక్టర్ స్థలాన్ని కూడా పరిశీలించారు. అన్ని తతంగాలు పూర్తయిన తర్వాత ఫైలు ఏసీఏకు చేరింది. అయితే జిల్లా క్రికెట్ సంఘం నుంచే ఫైలును పంపించాలని ఏసీఏ తనకు అందిన ఫైలును వెనక్కు పంపింది. కానీ జిల్లా క్రికెట్ సంఘం ధర్మవరం స్టేడియం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు పెద్దలు కావాలనే స్టేడియం నిర్మాణానికి అడ్డుపడ్డారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. -
ఎండీసీఏ అధ్యక్షుడిగా హఫీజుద్దీన్
ఎన్నికల పరిశీలకుడు నరేందర్‌గౌడ్ మహబూబ్‌నగర్ క్రీడలు : మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (ఎండీసీఏ) ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల పరిశీలకుడు, హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు నరేందర్‌గౌడ్ వెల్లడించారు. శుక్రవారం పద్మావతికాలనీలోని ఎం డీసీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. జనవరి 25న ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశామని, ఎన్నికల అధికారిగా రాజేందర్‌కుమార్ నియమించామని అన్నారు. ఫిబ్రవరి 3, 4తేదీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టామని, ఐదు పదవులకు ఐదు నామినేషన్ల దాఖలయ్యాయని తెలిపారు. అధ్యక్ష పదవికి సయ్యద్ హఫీ జుద్దీన్, ప్రధాన కార్యదర్శి పదవికి ఎం.రాజశేఖర్, జాయింట్ సెక్రెటరీకి భానుకిరణ్‌రెడ్డి, కోశాధికారి పదవికి జీఆర్.ఉదేశ్‌కుమార్, ఉపాధ్యక్ష పదవికి మహ్మద్ గౌస్ నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో అన్ని నామినేషన్లు సరిగాఉండి ఎటువంటి ఉపసంహరణ లేకపోవడం తో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. పది రోజుల్లో కార్యకలాపాలు పది రోజుల్లో జిల్లాలో క్రికెట్ కార్యకలాపాలు చేపడుతామని నరేందర్‌గౌడ్ అన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఒక అకాడమీ, రెండు క్యాంపులు నిర్వహించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందజేస్తామని తెలిపా రు. డివిజన్ల వారీగా క్రికెట్ పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీ సుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ సభ్యులు ఎస్‌ఆర్‌రెడ్డి కామత్, సతీష్ శ్రీవాస్తవ్, మాజీ రంజీ క్రీడాకారుడు ప్రహ్లాద్, ఎన్నికల అధికారి రాజేందర్‌కుమార్ పాల్గొన్నారు. ఎండీసీఏ అధ్యక్షుడిగా హఫీజుద్దీన్ ఎండీసీఏ ఎన్నికలు ఏకగ్రీవం కాగా అధ్యక్షుడి గా సయ్యద్ హఫీజుద్దీన్, ఉపాధ్యక్షుడిగా మ హ్మద్ గౌస్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగా భానుకిరణ్‌రెడ్డి, కో శాధికారిగా ఉదేశ్‌కుమార్ ఎన్నికయ్యారు. -
క్రీడా మైదానం మిత్రుడికి అంకితం..!
తిరుపతి నగరంలో 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎస్పీజేఎన్ఎం)లోని క్రీడామైదానం మొదటిదిగా గుర్తింపు పొందింది. ఈ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి ఉత్తమ క్రీడాకారులు కూడా ఎదిగారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ పాఠశాల క్రీడామైదానంలోకి ప్రస్తుతం క్రీడాకారులకు ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించిన ఓ మున్సిపల్ అధికారి స్నేహితుడు వాకింగ్ చేయడానికి అంకితం ఇచ్చారు. క్రీడాకారులు ఎవరూ ప్రవేశించకుండా గేటుకు తాళం కూడా వేశారు. తిరుపతి స్పోర్ట్స్ : తిరుపతి నగర కార్పొరేషన్‌లోని ఓ ఉన్నతాధికారి స్నేహితుడి వాకింగ్ చేయాలనే కోర్కె తీర్చేందుకు శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని మైదానంలో లక్షలు ఖర్చుపెట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ దెబ్బతినకుండా, వాకింగ్ సమయంలో స్నేహితుడికి అసౌకర్యం లేకుండా ప్రహరీ నిర్మించి దానికి ఇనుప గేట్లు వేయించారు. ఈ గేటుకు తాళం వేసి, తాళాలను తన స్నేహితుడికి అందించినట్టు సమాచారం. దీంతో మైదానంలోకి విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు సెలవు ఇచ్చిన రోజు ల్లో కూడా పాఠశాల విద్యార్థులు, క్రీడాకారు లు మైదానంలోకి వెళ్లలేక పోతున్నారు. ఇదే మైదానంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్నప్పటికీ క్రికెట్ స్వేచ్ఛగా ఆడలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు క్రీడాకారులు ఎతైన ప్రహరీ గోడ, ఇనుప గేటు దూకి, కిందపడి గాయపడ్డారు. ఎవరైనా సా హసించి మైదానంలో ఆడుతుంటే బలవంతంగా వెళ్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం క్రీడాకారుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారులకు ఇబ్బందనీ... విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే తాళాలు వేశాం. రోజూ సాయంత్రం కొంత సేపు విద్యార్థులకు క్రీడలను నేర్పించి తిరిగి తాళాలు వేస్తున్నాం. ఇతరులు లోనికి రాకుండా కట్టడి చేయచ్చు. ఇక మైదానంలో వాకింగ్ ట్రాక్ ఎవరి కోసం వేశారో నాకు తెలియదు. -రెడ్డెప్పరెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం,ఎస్పీజేఎన్ఎం పాఠశాల. తిరుపతి