ఎండీసీఏ అధ్యక్షుడిగా హఫీజుద్దీన్ | MDCA president | Sakshi
Sakshi News home page

ఎండీసీఏ అధ్యక్షుడిగా హఫీజుద్దీన్

Published Sat, Feb 7 2015 1:43 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

MDCA president

ఎన్నికల పరిశీలకుడు నరేందర్‌గౌడ్
 మహబూబ్‌నగర్ క్రీడలు : మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (ఎండీసీఏ) ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల పరిశీలకుడు, హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు నరేందర్‌గౌడ్ వెల్లడించారు. శుక్రవారం పద్మావతికాలనీలోని ఎం డీసీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు.
 
 జనవరి 25న ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశామని, ఎన్నికల అధికారిగా రాజేందర్‌కుమార్ నియమించామని అన్నారు. ఫిబ్రవరి 3, 4తేదీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టామని, ఐదు పదవులకు ఐదు నామినేషన్ల దాఖలయ్యాయని తెలిపారు. అధ్యక్ష పదవికి సయ్యద్ హఫీ జుద్దీన్, ప్రధాన కార్యదర్శి పదవికి ఎం.రాజశేఖర్, జాయింట్ సెక్రెటరీకి భానుకిరణ్‌రెడ్డి, కోశాధికారి పదవికి జీఆర్.ఉదేశ్‌కుమార్, ఉపాధ్యక్ష పదవికి మహ్మద్ గౌస్ నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో అన్ని నామినేషన్లు సరిగాఉండి ఎటువంటి ఉపసంహరణ లేకపోవడం తో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు.
 
 పది రోజుల్లో కార్యకలాపాలు
 పది రోజుల్లో జిల్లాలో క్రికెట్ కార్యకలాపాలు చేపడుతామని నరేందర్‌గౌడ్ అన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఒక అకాడమీ, రెండు క్యాంపులు నిర్వహించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందజేస్తామని తెలిపా రు. డివిజన్‌ల వారీగా క్రికెట్ పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీ సుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ సభ్యులు ఎస్‌ఆర్‌రెడ్డి కామత్, సతీష్ శ్రీవాస్తవ్, మాజీ రంజీ క్రీడాకారుడు ప్రహ్లాద్, ఎన్నికల అధికారి రాజేందర్‌కుమార్ పాల్గొన్నారు.
 
 ఎండీసీఏ అధ్యక్షుడిగా హఫీజుద్దీన్
 ఎండీసీఏ ఎన్నికలు ఏకగ్రీవం కాగా అధ్యక్షుడి గా సయ్యద్ హఫీజుద్దీన్, ఉపాధ్యక్షుడిగా మ హ్మద్ గౌస్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగా  భానుకిరణ్‌రెడ్డి, కో శాధికారిగా ఉదేశ్‌కుమార్ ఎన్నికయ్యారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement