బస్సు - లారీ ఢీ : ఇద్దరు డ్రైవర్లు మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాములలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.