division committee
-
వనజాక్షి గీత దాటలేదు
♦ అది ముసునూరు పరిధే ♦ ద్విసభ్య కమిటీ నివేదిక సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. ముసునూరు మండలంలోని తమ్మిలేరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో వెళ్లి అడ్డుకున్నందుకు ఆమె దాడికి గురైన విషయం విదితమే. చింతమనేని పె చర్యలు తీసుకునే వరకూ ఆందోళన చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెచ్చరించడంతో సీఎం చంద్రబాబు వారిని పిలిపించి మాట్లాడి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. దీంతె ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ, ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ ఈ అంశంపై విచారణ జరిపింది. నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్‌కు సమర్పించింది. దీనిని సీఎస్ ముఖ్యమంత్రికి పంపించారు. అది ముసునూరు తహసీల్దారు పరిధిలోనిదే విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలిలా ఉన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలను వనజాక్షి అడ్డుకున్న తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుంది. తహసీల్దారు తన పరిధికి చెందని ప్రాంతంలోకి వచ్చి అనవసర రాద్ధాంతం చేశారని చింతమనేని చేసిన వాదనలో నిజం లేదు. చింతమనేని మందిని తీసుకెళ్లి దాడికి దిగడం తప్పు. అలాగే వనజాక్షి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్లు వ్యవహరించి ఉండరాదు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చర్యలు తీసుకుని ఉండాల్సింది. విప్ చింతమనేనిదే ఎక్కువ తప్పు ఉన్నట్లు తేలినందున ముఖ్యమంత్రి ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
మంగపేట : ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు–లెనినిస్టు) సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు(భూపాలపల్లి) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆధ్వర్యంలో తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల పరిస్థితుల వల్ల ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు, గూడాల్లో ఈగలు, దోమల వలన ప్రజలు మలేరియా, డెంగీ, కల రా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందేవిధంగా చూడాలని తహసీల్దార్‌ను కోరారు. ఆ సంఘం మం డల నాయకులు గాడిచర్ల సాంబన్న, శంకర్, కిరణ్, బాపురత్నం, ముత్తన్న, ఎల్లన్న, సోమన్న, బుచ్చిరెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ యూత్ కమిటీల నియామకం
జిల్లా కమిటీలోకి 23 మంది మండల కమిటీలోకి 13 మంది డివిజన్ కమిటీలోకి 11 మంది సిటీ కమిటీలో ఇద్దరికి స్థానం వెల్లడించిన రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, కళ్యాణ్‌రాజ్ కాజీపేట రూరల్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, టౌన్, సిటీ, డివిజన్ కమిటీలను ఆదివారం ప్రకటించింది. 51 మందితో యువజన, జిల్లా, మండల, నగర కమిటీలను నియామకం చేశారు. ఈ మేరకు వివరాలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ ఆదివారం వె ల్లడించారు. జిల్లా యూత్ కమిటీలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీగా బొడ్డు శ్రావణ్, గడ్డం రఘుపతి, దేవర రమేష్, బుర్ర మహేందర్ నియామకమయ్యారు. కార్యదర్శులుగా కల్లాపు ప్రవీణ్, మేకల సిద్దార్థ, సాంబరాజు ప్రవీన్, మహ్మద్ రహమాన్, జాయింట్ సెక్రటరీలుగా టార్జన్ సింగ్, అక్కల అనిల్ కుమార్, జల్లి వేణు, చిర్ర అనిల్, కాయిత కుమార్, బూర సుదర్శన్‌గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గాడిపెల్లి శ్రీను, పెసర్ల రాజు, సంపతి కృష్ణ, సయ్యద్ చాంద్‌పాషా, కోటగిరి కృష్ణమూర్తి, గాదె మహేష్, షేక్ జావీద్, కీసరి రాంబాబు, గండ్ల రాజు నియామకమయ్యారు. జనగాం యూత్ టౌన్ అధ్యక్షునిగా గుగ్గిల్ల శ్రీధర్ నియామకం అయ్యారు. నగర కమిటీలో.. యూత్ నగర ప్రధాన కార్యదర్శులుగా కానుకుంట్ల రమాకాంత్, మోడెం రాజేష్‌గౌడ్ నియామకమయ్యారు. డివిజన్ యూత్ ప్రెసిడెంట్లు వీరే.. మాత్రాసి శ్రీధర్(29వ డివిజన్), పరికి నట్రాజ్(28వ డివి జన్), పల్లె మధు(30వ డివిజన్), ఎండి.అరిఫ్ అలీ(23వ డివిజన్), గొల్లపెల్లి శేఖర్(34వ డివిజన్), కాగితాల శ్రీని వాస్(47వ డివిజన్), అన్వర్ మోహినుద్దీన్(50వ డివిజన్), ఎండి.ఇమ్రాన్(48వ డివిజన్), కందుకూరి ప్రణయ్(36వ డివిజన్), ఎండి.అబ్దుల్ పర్వేజ్(44వ డివిజన్), అబ్దుల్ సమద్(10వ డివిజన్) నియామకం అయ్యారు. మండల యువజన అధ్యక్షులుగా 13 మంది.. రఘునాథపల్లి మండల యువజన అధ్యక్షుడిగా బక్క జంపన్న, మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా నరేందర్‌రెడ్డి, బానోతు వీరన్న(కేసముద్రం), నిమ్మిపోయిన రమేష్(వర్ధన్నపేట), కోతుల మధు (పర్వతగిరి), కోట సోంరాజు(చేర్యాల), రాజ్‌కుమార్‌గౌడ్(నర్మెట),కోల్పుల పురుషోత్తం(మద్దూరు), బుర్ర సుమన్(నర్సంపేట), మడుగుల రాజిరెడ్డి(నల్లబెల్లి), అసోల సురేష్(దుగ్గొండి), బానోతు బాలకృష్ణ(ఖానాపురం), ఎస్కె.గౌస్(ఏటూరు నాగారం)ను నియమించారు. -
విభజన కమిటీలతో సీఎస్ సమావేశం
-
విభజన కమిటీలతో సీఎస్ సమావేశం
హైదరాబాద్ : విభజన కమిటీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమావేశం ముగిసింది. ఆయన బుధవారం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. విభజన విధివిధానాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం వందమంది అధికారులు కావాలని సీఈసీ కోరినట్లు మహంతి తెలిపారు. ఎన్నికల విధులు ఉన్నప్పటికి కూడా విభజన విషయాలు తేల్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు. అపాయింటెట్డే జూన్ 2లోగా ఉద్యోగులు ఆస్తులు, అప్పులు, ఫైళ్ళ పంపిణీ పూర్తి కావాలని సూచించారు. సాధ్యమైనంతవరకూ కోర్టు కేసులు రాకుండా చూసుకోవాలన్నారు. ఉద్యోగుల విభజన విధివిధానాల కోసం కమలనాథ్ కమిటీ వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసి కమిటీలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఐఎస్‌ల విభజన కమిటీకి నేతృత్వం వహించాలని సీనియర్ ఐఏఎస్ శామ్యూల్‌ను కోరినట్లు కార్యదర్శులతో మహంతి తెలిపారు. ఎంప్లాయి డేటా ఇవ్వని ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా ఇప్పటివరకూ 7లక్షల మంది ఉద్యోగులు తమ వివరాలను సమర్పించారు.