వనజాక్షి గీత దాటలేదు | MRO Vanajakshi Not Stripe : Division Committee | Sakshi
Sakshi News home page

వనజాక్షి గీత దాటలేదు

Published Fri, Jun 30 2017 3:32 AM | Last Updated on Thu, Apr 4 2019 12:56 PM

వనజాక్షి గీత దాటలేదు - Sakshi

వనజాక్షి గీత దాటలేదు

అది ముసునూరు పరిధే
ద్విసభ్య కమిటీ నివేదిక


సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది.  ముసునూరు మండలంలోని తమ్మిలేరులో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ హోదాలో వెళ్లి అడ్డుకున్నందుకు ఆమె దాడికి గురైన విషయం విదితమే. చింతమనేని పె చర్యలు తీసుకునే వరకూ ఆందోళన చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెచ్చరించడంతో సీఎం చంద్రబాబు వారిని పిలిపించి మాట్లాడి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

దీంతె ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్‌ చంద్ర శర్మ, ఐఏఎస్‌ అధికారి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ ఈ అంశంపై విచారణ జరిపింది. నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేష్‌ కుమార్‌కు సమర్పించింది. దీనిని సీఎస్‌ ముఖ్యమంత్రికి పంపించారు.

అది ముసునూరు తహసీల్దారు పరిధిలోనిదే
విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలిలా ఉన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలను వనజాక్షి  అడ్డుకున్న తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుంది. తహసీల్దారు తన పరిధికి చెందని ప్రాంతంలోకి వచ్చి అనవసర రాద్ధాంతం చేశారని  చింతమనేని  చేసిన వాదనలో నిజం లేదు. చింతమనేని మందిని తీసుకెళ్లి  దాడికి దిగడం తప్పు.  అలాగే వనజాక్షి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్లు వ్యవహరించి ఉండరాదు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చర్యలు తీసుకుని ఉండాల్సింది. విప్‌ చింతమనేనిదే ఎక్కువ తప్పు ఉన్నట్లు తేలినందున ముఖ్యమంత్రి ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement