
విభజన కమిటీలతో సీఎస్ సమావేశం
హైదరాబాద్ : విభజన కమిటీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమావేశం ముగిసింది. ఆయన బుధవారం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. విభజన విధివిధానాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం వందమంది అధికారులు కావాలని సీఈసీ కోరినట్లు మహంతి తెలిపారు. ఎన్నికల విధులు ఉన్నప్పటికి కూడా విభజన విషయాలు తేల్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు.
అపాయింటెట్డే జూన్ 2లోగా ఉద్యోగులు ఆస్తులు, అప్పులు, ఫైళ్ళ పంపిణీ పూర్తి కావాలని సూచించారు. సాధ్యమైనంతవరకూ కోర్టు కేసులు రాకుండా చూసుకోవాలన్నారు. ఉద్యోగుల విభజన విధివిధానాల కోసం కమలనాథ్ కమిటీ వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసి కమిటీలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఐఎస్ల విభజన కమిటీకి నేతృత్వం వహించాలని సీనియర్ ఐఏఎస్ శామ్యూల్ను కోరినట్లు కార్యదర్శులతో మహంతి తెలిపారు. ఎంప్లాయి డేటా ఇవ్వని ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా ఇప్పటివరకూ 7లక్షల మంది ఉద్యోగులు తమ వివరాలను సమర్పించారు.