cs mahanthy
-
చంద్రబాబును కలిసిన సీఎస్ మహంతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం భేటీ అయ్యారు. మహంతితో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, సచివాలయంలో ఉద్యోగుల విభజనపై వారు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. -
‘ఎక్స్ కేడర్’పై మా ఆదేశాలు ఎందుకు ఉల్లంఘించారు?
సీఎస్ మహంతికి హైకోర్టు సూటి ప్రశ్న హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్స్ కేడర్ స్థాయి పోస్టులను నిబంధనలకు మించి సృష్టించవద్దన్న తమ ఆదేశాలను ఉల్లంఘించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎస్ మహంతిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మంగళవారం స్వయంగా కోర్టుకు హాజరుకావాలని మహంతిని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ మాజీ ప్రత్యేక కార్యదర్శి షఫీకుజ్జమాన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ వ్యవహార శైలి సంతృప్తికరంగా లేదని మండిపడింది. కాగా, రాష్ట్రంలోని ఎక్స్ కేడర్ పోస్టులను నిబంధనలకు మించి సృష్టించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిర్దేశిత సంఖ్య కన్నా సీఎస్ స్థాయిలో ఎక్స్‌కేడర్ పోస్టులు సృష్టించారని, ఇది కోర్టు ధిక్కారమవుతుందని, ఎన్.రమేష్‌కుమార్ అనే అధికారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చారని ఇది కూడా కోర్టు ఆదేశాలకు విరుద్ధమని షఫీకుజ్జమాన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
విభజన కమిటీలతో సీఎస్ సమావేశం
-
విభజన కమిటీలతో సీఎస్ సమావేశం
హైదరాబాద్ : విభజన కమిటీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమావేశం ముగిసింది. ఆయన బుధవారం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. విభజన విధివిధానాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం వందమంది అధికారులు కావాలని సీఈసీ కోరినట్లు మహంతి తెలిపారు. ఎన్నికల విధులు ఉన్నప్పటికి కూడా విభజన విషయాలు తేల్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు. అపాయింటెట్డే జూన్ 2లోగా ఉద్యోగులు ఆస్తులు, అప్పులు, ఫైళ్ళ పంపిణీ పూర్తి కావాలని సూచించారు. సాధ్యమైనంతవరకూ కోర్టు కేసులు రాకుండా చూసుకోవాలన్నారు. ఉద్యోగుల విభజన విధివిధానాల కోసం కమలనాథ్ కమిటీ వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసి కమిటీలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఐఎస్‌ల విభజన కమిటీకి నేతృత్వం వహించాలని సీనియర్ ఐఏఎస్ శామ్యూల్‌ను కోరినట్లు కార్యదర్శులతో మహంతి తెలిపారు. ఎంప్లాయి డేటా ఇవ్వని ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా ఇప్పటివరకూ 7లక్షల మంది ఉద్యోగులు తమ వివరాలను సమర్పించారు. -
రేపు కమలనాధన్ కమిటీ సమావేశం
-
ఢిల్లీ నుంచి సీఎస్ మహంతికి పిలుపు
హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ మహంతికి హస్తిన నుంచి పిలుపు వచ్చింది. బుధవారం కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో విభజన తేదీ ఖరారుకే సీఎస్‌కు ఢిల్లీ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించాలా ? లేక కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా అనే దానిపై కాంగ్రెస్ హై కమాండ్ ఎటు తేల్చుకోలేక పోతోంది. కాగా మహంతి ఈనెల 28వ తేదీతో పదవీ విరమణ అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సీఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీలోనే జరగనుంది. రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్రానికి చేరవేయడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో మహంతితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావు కీలక భూమిక పోషించారు. విభజన తర్వాత పంపిణీలోనూ ఇరువురు కీలక భూమిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
విద్యుత్ పొదుపులో ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం
హైదరాబాద్ : విద్యుత్ ఆదాపై అవగాహన పెంచేందుకు ప్రచార సామాగ్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం విడుదల చేశారు. విద్యుత్ పొదుపులో ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎస్ తెలిపారు. ప్రజలంతా విద్యుత్ పొదుపు మార్గాలను పాటిస్తే 15 శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన అన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సి ఉందని మహంతి అభిప్రాయపడ్డారు.