ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం భేటీ అయ్యారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం భేటీ అయ్యారు. మహంతితో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, సచివాలయంలో ఉద్యోగుల విభజనపై వారు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం.