divitipally
-
మాకొద్దీ అమరరాజా.. వ్యతిరేకంగా నిరసనలు
-
ప్రతిపక్షాలకు మంత్రుల సవాల్.. నిరూపిస్తే రాజీనామాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణను అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ ప్రాజెక్టులను విరమించుకోవాలని.. లేకుంటే ప్రజాయుద్ధం తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మొండి అని.. మంచికి మంచి, చెడుకు చెడుగా ఉంటారని.. తెలంగాణకు నష్టం వాటిల్లేలా ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తూ ఊరుకోరన్నారు. త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర సీఎం రాయలసీమ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాల్వ కట్టి తీసుకుపోతున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతుంటే.. పాలమూరు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి మంగళహారతులు పట్టారని విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎక్కడ ఉన్నా ఆంధ్రోళ్లేనని.. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు బతకొద్దా... ఎవరి బతుకులు వాళ్లు బతకాలని, రైతులు ఎక్కడ ఉన్నా రైతులేనని.. తెలంగాణలోని రైతులు కూడా బతకొద్దా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్‌లపై మరో ప్రజాయుద్ధం చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్నింటా ముందంజలో ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు.. లాంటి పథకాలు మీరు పాలించే ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలంటూ వేముల ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వారు మొరిగే కుక్కలని.. ఇవి తప్పని నిరూపిస్తే తనతో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు అన్యాయం జరిగే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరన్నారు. కాగా, సభ చివరలో ఆంధ్ర నిర్మించే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. చదవండి: ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు -
రైతుల ఆందోళన ఉధృతం
సాక్షి, మహబూబ్‌నగర్ : దివిటిపల్లి ఐటీ కారిడార్ భూ నిర్వాసితుల ఆందోళన జఠిలమవుతోంది. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో వారు తమ ఆందోళనను మూడోరోజు కూడా కొనసాగించారు. నష్టపరిహారం కోసం కారిడార్ కోసం సేకరించిన స్థలంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు గురువారం అర్బన్ మండల తహసీల్దార్ వెంకటేశం ఐటీ అధికారులతో కలిసి వచ్చి చర్చలు జరిపారు. కారిడార్ కోసం సేకరించిన భూమిలో ఐటీ టవర్ నిర్మాణానికి అడ్డు తెలుపకూడదని, త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పరిహారం చెల్లింపు ఆలస్యమైందని, వాటిని సరిచేసి పరిహారం చెల్లింపు సాధ్యమైనంత త్వరగా చేస్తామని హామీ ఇచ్చారు. పరిహారం చెల్లిస్తేనే ఐటీ టవర్ నిర్మించడానికి అంగీకరిస్తామని, లేకుంటే అడ్డుకుంటామని రైతులు తేల్చిచెప్పారు. టవర్ నిర్మాణం పనులు కొనసాగనివ్వాలని, ఒకవేళ అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా తహసీల్దార్ హెచ్చరించారు. పెద్ద రైతులకు మాత్రం పరిహారం చెల్లించి ఎకరా, అర ఎకరం భూములు గల తమకు నష్టపరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని రైతులు ప్రశ్నించారు. రైతులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, పట్టణ కార్యదర్శి చంద్రకాంత్, సభ్యులు ఆదివిష్ణు, తిరుమలయ్యలు వెన్నుదన్నుగా నిలిచి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో తహసీల్దార్ వెంకటేశం రైతులతో జరిపిన చర్చలు దాదాపు విఫలమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో నాల్గో రోజు రైతుల ఆందోళన కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని 556, 607 సర్వేనంబర్ల రైతులకు నష్టపరిహారం త్వరగా చెల్లిస్తే సమస్య మరింత త్వరగా పరిష్కారమై ఐటీ టవర్ నిర్మాణం చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. -
రైతుల ప్రతిఘటన
భూ సేకరణను అడ్డుకున్న దివిటిపల్లి రైతులు హద్దురాళ్లు, జెండాలను తొలగించిన రైతులు భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూంల డిమాండ్ మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల, జిల్లా జైలు, డబుల్ బెడ్రూంల నిర్మాణానికి గాను మహబూబ్‌నగర్ మండలం ఎదిర గ్రామపంచాయతీ పరిధిలోని దివిటిపల్లి గ్రామ రైతుల నుండి సేకరించతలపెట్టిన భూసేకరణను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఎదిర, దివిటిపల్లి గ్రామాల్లో సుమారు 112 ఎకరాల అసైన్డు భూములను సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఇదివరకు సేకరించిన భూమి చుట్టూ హద్దు రాళ్లను, జెండాలను ఏర్పాటు చేశారు. ఇందిర హయాంలో భూ పంపిణీ 1969లో సర్వేనంబర్లు 423, 417, 425, 372లలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో 36 మంది రైతులకు 97 ఎకరాల అసైన్డు భూమిని పంపిణీ చేసి 1972లో పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి సమాచారం ఇవ్వకుండానే జెండాలు, హద్దు రాళ్లను పాతడం, భూములను స్వాధీనం చేసుకోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 మంది రైతులకు సంబంధించి 97 ఎకరాల భూమిని సర్వే చేసి సరిహద్దు రాళ్లను పాతి వెళ్లారు. హద్దు రాళ్లను తొలగించిన రైతులు రైతులు మంగళవారం తమ భూముల్లో అధికారులు పాతిన హద్దు రాళ్లు, జెండాలను తొలగించారు. భూ సేకరణ జరిపే ముందు తమకు సమాచారం అందించాలని, భూమికి భూమి ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూంల నిర్మాణాలలో భూములు కోల్పోతున్న రైతులందరికీ అవకాశం కల్పించాలని, అలా చేయని పక్షంలో భూసేకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. భూములు కోల్పోతున్న తమకు డబుల్ బెడ్రూంల నిర్మాణాలలో అవకాశం ఇవ్వకుండా ఇతరులకు తమ భూముల్లో ఇళ్లు కట్టిస్తామని పేర్కొనడంతో వారిలో ఆవేశాన్ని రగిల్చింది. తమకే డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవాలని, కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష పార్టీల నాయకుల మద్దతు దివిటిపల్లి గ్రామ రైతుల ఆందోళనకు అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. తమ ఆందోళనకు రాజకీయ పార్టీల నాయకుల మద్దతు తోడు కావడంతో రైతులు ఉద్యమాన్ని తీవ్రరూపం చేయడానికి సిద్ధమవుతున్నారు. నానా కష్టాలు పడ్డాం 1969లో నానా తిప్పలు పడి భూమిని సంపాదించుకున్నాం. చస్తే కూడా బొందలు పెట్టుకోవడానికి మాకు స్థలం లేదు. ప్రాణం పోయినా సరే భూములను వదలం. – నర్సింహులు, రైతు అన్యాయం చేస్తుండ్రు గుట్టలు, చెట్లు చదును చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన భూమిలో పంట లు సాగు చేసున్నాం. అధికారులు అన్యాయంగా భూమిని లాక్కుంటున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. – బాలాజి, రైతు రాళ్లు, రప్పలు తొలగించాం 45 ఏళ్లుగా ఖాస్తు చేస్తున్నా. రూ. 8 లక్షలు ఖర్చు పెట్టి రాళ్లు, రప్పలు తొలగించి సాగుచేస్తున్నా. ఐదు బోర్లు వేస్తే అందులో మూడు పోయాయి. ప్రస్తుతం పొలంలో వరి నాట్లు వేయాల్సి ఉంది. బయపడి కూలీలు రావడంలేదు. – జంగయ్య, రైతు